Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనానికి విమాన ప్యాకేజీ...

ప్రఖ్యాత తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ పర్యాటక శాఖ విమాన ప్యాకేజీని ప్రకటించింది. అలాగే, ఇతర పుణ్య క్షేత్రాల దర్శనానికి కూడా ప్రకటించింది.

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (13:00 IST)
ప్రఖ్యాత తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ పర్యాటక శాఖ విమాన ప్యాకేజీని ప్రకటించింది. అలాగే, ఇతర పుణ్య క్షేత్రాల దర్శనానికి కూడా ప్రకటించింది. విమానంలో ప్రయాణం, దర్శనం, భోజనం, వసతి సదుపాయాలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
 
సందర్శించే ప్రదేశాలు: తిరుమల, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి
 
ఒక రోజు ప్యాకేజీ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉదయం 6:55 గంటలకు స్పైస్‌జెట్‌ విమానంలో యాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 8:10 గంటలకి తిరుపతికి, 9:30 లోపు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనం, తిరుచానూరు అమ్మవారి దర్శనం తర్వాత అదే రోజు సాయంత్రం 5:30కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి. రాత్రి 7:45కు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఇందుకోసం రూ.9999 ప్యాకేజీని ప్రకటించింది. 
 
రెండు రోజుల ప్యాకేజీ: ఉదయం 9:25కు హైదరాబాద్‌లో ప్రయాణం మొదలవుతుంది. అదే రోజు శ్రీకాళహస్తి, కాణిపాకం సందర్శన, మరుసటి రోజు శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటాయి. రెండో రోజు సాయంత్రం 6:35కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7:45కు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఈ యాత్రకు రూ.12,999 ప్యాకేజీ కింద వసూలు చేస్తారు. 
 
వసతి: త్రీస్టార్‌ హోటళ్ళలో వసతి, భోజన సౌకర్యం. బుకింగ్‌ వివరాలు: తెలంగాణ టూరిజం శాఖ కార్యాలయాలు అన్నిటిలో బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా బుకింగ్‌ సౌకర్యం త్వరలో కల్పించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం.. చంద్రబాబు

పెళ్లైన రోజే.. గోడకు తలను కొట్టి.. చీరతో గొంతుకోసి భార్యను చంపేశాడు

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments