Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (13:25 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనతో ఈవో జవహర్‌ రెడ్డి బుధవారం ప్రమాణం చేయించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. 
 
కాగా, తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్ర‌మాణం చేయ‌డం ఇది రెండోసారి. ఈ కార్యక్ర‌మానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌ర‌య్యారు.
 
ఇకపోతే, తితిదే బోర్డు సభ్యుల నియామకం చేపట్టనున్నారు. వైవీ సుబ్బారెడ్డి తొలిసారి 2019, జూన్‌ 21న టీటీడీ ఛైర్మ‌న్‌గా నియమితులైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో మొత్తం 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. జూన్‌ 21వ తేదీ నాటికి వారి ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో కొత్త పాల‌క మండలి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments