ఈ నెల 13న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:52 IST)
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైవున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన ప్రత్యేక టిక్కెట్లను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఈ టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తితిదే వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలాలయం వాయిదాపడటంతో ఈ మేరకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, అంగప్రదక్షిణ టిక్కెట్లను తితిదే రేపు విడుదల చేనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ వరకు వర్తించే ఈ టిక్కెట్లను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వీటిని https://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో కానీ, TT Devasthanams యాప్ ద్వారా కానీ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

Nobel Peace Prize ట్రంప్‌కి కాదు, మరియా కొరినా మచాడోని వరించిన పురస్కారం

కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ 2026 జనవరిలో విడుదల: నారా లోకేష్

డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ పురస్కారం.. మద్దతిచ్చిన రష్యా

నోబెల్ బహుమతి కోసం అడుక్కుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇలా ఎప్పుడైనా జరిగిందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

07-10-2025 మంగళవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments