శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు సిద్ధం చేసిన తితిదే - తొలి 3 రోజులు వారికే..

Webdunia
గురువారం, 14 మే 2020 (16:02 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఫలితంగా గత 50 రోజులకు పైగా తిరుమల కొండపైకి భక్తులు ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. కేవలం తిరుమల గిరిపై నివాసిస్తున్న ఉద్యోగులు, తితిదే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17వ తేదీన లాక్డౌన్ ఎత్తివేసిన పక్షంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 
 
వీటిలోభాగంగా, తొలి మూడు రోజుల పాటు కేవలం తితిదే సిబ్బందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరుపతి, తిరుమల ప్రజలకు 15 రోజుల పాటు దర్శనం అందుబాటులోకి తెస్తారు. అదీకూడా ప్రయోగాత్మకంగా ఈ దర్శనం కల్పించనున్నారు.
 
అంతేకాకుండా, రోజుకు కేవలం 14 గంటల పాటు కేవలం 500 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ లెక్కన వారానికి 7 వేలు మంది మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఇతర భక్తుల కోసం దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విక్రయించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాదాలు వద్దు.. చర్చలే ముద్దు.. నీటి సమస్యల పరిష్కారానికి రెడీ.. రేవంత్ రెడ్డి

తితిదే పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా

హీరో నవదీప్‌కు ఊరట.. డ్రగ్స్ కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

బాలిక మంచంపై ఆ పని చేసిందని.. సవతి తల్లి వేడి చేసిన గరిటెతో...?

కోనసీమ జిల్లాలో గ్యాస్ బావి పేలుడు.. ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

Varahi Puja: కృష్ణపక్ష పంచమి రోజున వారాహి దేవిని పూజిస్తే..?

07-01-2026 బుధవారం ఫలితాలు - స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు...

Lambodara Sankashti Chaturthi: లంబోదర సంకష్టహర చతుర్థి 2026.. లంబోదరుడిని ప్రార్థిస్తే?

06-01-2026 మంగళవారం ఫలితాలు - ప్రారంభించిన పనులు మధ్యలో ఆపివేయొద్దు...

గోరింటాకు చెట్టుకు సీతమ్మకు ఏంటి సంబంధం.. గోరింటాకు చెట్టును పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments