Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు సిద్ధమైన తితిదే...

Webdunia
గురువారం, 27 మే 2021 (10:38 IST)
హనుమంతుడి జన్మస్థలం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం హనుమంతుడి జన్మస్థలంపై ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హనుమంతుడి జన్మస్థలంపై ఆయనతో చర్చకు టీటీడీ సిద్ధమైంది. 
 
ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్న గోవిందానంద సరస్వతి... మంగళ, బుధవారాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం టీటీడీ ఎస్వీ వేదాధ్యయన ప్రాజెక్ట్‌ అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ ఆయనను కలసి చర్చకు ఆహ్వానించారు. తిరుమల అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం అంటూ టీటీడీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి టీటీడీ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు లేఖలు రాశారు. హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలోనే చర్చకు వస్తామంటూ గోవిందానంద సరస్వతి తన చివరి లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.
 
ఈ క్రమంలో గురువారం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో టీటీడీ పండిత బృందం తమ వద్దనున్న ఆధారాలు బయటపెట్టి హనుమంతుడి జన్మస్థలంపై గోవిందానంద సరస్వతితో చర్చించనున్నారు. ఇందులో పలువురు పండితులు పాల్గొనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

లేటెస్ట్

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments