Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ రూ.200, వడ ధర రూ.100గా పెంపు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తే లడ్డూ తీసుకోకుండా భక్తులు కొండ దిగరు. అలాంటి లడ్డూ ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (13:47 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తే లడ్డూ తీసుకోకుండా భక్తులు కొండ దిగరు. అలాంటి లడ్డూ ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌పై పొందే లడ్డూల ధరలు యధాతథంగా వుంటాయని.. సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లోనూ ఎలాంటి మార్పు వుండదని టీటీడీ తెలిపింది.
 
ఇక సర్వదర్శనం, దివ్యదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి రాయితీ పద్ధతిలో టీటీడీ లడ్డూలను అందజేస్తూ వుంటుంది. రాయితీ లడ్డూలు కాకుండా ఎక్కువ లడ్డూలు కావాలంటే కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి వుంటుంది. 
 
కొందరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేయడానికి సిఫార్సు లేఖలు సైతం ఇస్తుంటారు. అలాంటి సిఫార్సు లేఖలపై జారీచేసే లడ్డూల ధరలను పెంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా టీటీడీ రేటును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు ఈ నెల 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments