Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 14 January 2025
webdunia

జియో దెబ్బకు ఎయిర్‌టెల్ బెంబేలు ... హాట్‌స్పాట్ ధర తగ్గింపు

స్వదేశీ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు వణికిపోతున్నాయి. జియో అతి తక్కువ ధరలకే తన సేవలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతూ, నెలకోసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటిస్తూ వస్తోంది.

Advertiesment
జియో దెబ్బకు ఎయిర్‌టెల్ బెంబేలు ... హాట్‌స్పాట్ ధర తగ్గింపు
, బుధవారం, 13 డిశెంబరు 2017 (16:43 IST)
స్వదేశీ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు వణికిపోతున్నాయి. జియో అతి తక్కువ ధరలకే తన సేవలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతూ, నెలకోసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఎయిర్ టెల్ తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులోభాగంగా, తన 4జీ హాట్ స్పాట్ డివైస్‌ను ఇప్పుడు కేవలం రూ.999కే అందివ్వనున్నట్టు ప్రకటించింది. 
 
ఇప్పటివరకు ఎయిర్‌టెల్ అందిస్తూ వచ్చిన 4జీ హాట్‌స్పాట్ డివైస్ ధర రూ.1950గా ఉండేది. కానీ ఈ డివైస్ ధరను బుధవారం తగ్గించింది. దీంతో ఇప్పుడు కేవలం రూ.999కే ఈ డివైస్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇక జియో కూడా రూ.2,329 ఉన్న తన జియోఫై హాట్‌స్పాట్ డివైస్ ధరను ఈ మధ్యే రూ.999 చేసింది. దీంతో ఎయిర్‌టెల్ కూడా తన హాట్‌స్పాట్ డివైస్‌ను ఇదే ధరకు అందిస్తూ జియోకు పోటీగా నిలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను రామసేతు ''ఉడుత''ను: రాజమౌళి