శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ లడ్డూల విక్రయం!

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు శుభవార్త చెప్పింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలను ఇకపై ఆన్‌లైన్‌లోనూ విక్రయించాలని నిర్ణయించింది. అంటే.. తిరుమల వెంకన్న లడ్డూలు కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకంటే.. సమీపంలోని తితిదే సమాచార కేంద్రాలు, తితిదే కళ్యాణ మండపాల్లో తీసుకోవచ్చు. 
 
శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందిచాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నారు. రూ.25కే రాయితీ లడ్డూలను అన్ని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో విక్రయిస్తున్నారు. అటు ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు ఎంత మొత్తంలో కావాలన్నా.. పంపిణీ చేస్తామని టీటీడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
ఈ ప్రత్యేక ఆర్డర్ లడ్డూలకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఇకపై లడ్డూలను ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు జరపాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో లడ్డూలు ఆర్డర్ చేసేవాళ్లు.. వాటిని తమకు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాల నుంచి సేకరించే సదుపాయాన్ని కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

లేటెస్ట్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

తర్వాతి కథనం
Show comments