Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి చంద్రబాబుకి శ్రీవారి భక్తులు మొర.. ఎందుకు?

ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు శ్రీనివాసుని భక్తులు మెయిల్స్ పంపుతున్నారట. ఆ మెయిల్స్‌లో టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయమంటూ సమాచారాన్ని పంపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో వ్యయప్రయాసలుకోర్చి ఎలాగోలా దర్శించుకుని ప్రసాదాలను తీసుకెళద

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (21:17 IST)
ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు శ్రీనివాసుని భక్తులు మెయిల్స్ పంపుతున్నారట. ఆ మెయిల్స్‌లో టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయమంటూ సమాచారాన్ని పంపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో వ్యయప్రయాసలుకోర్చి ఎలాగోలా దర్శించుకుని ప్రసాదాలను తీసుకెళదామనుకుంటే ఆ ప్రసాదం రేట్లను ఇంత భారీ స్థాయిలో పెంచడమా అంటూ శ్రీవారి భక్తులు మెయిల్స్ ద్వారా పంపారు. అంతటితో ఆగలేదు... టిటిడి ఉన్నతాధికారులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.. వారిపై నియంత్రణ ఖచ్చితంగా ఉండాలంటూ మెయిల్స్ ద్వారా కోరారు.
 
మెయిల్స్ పంపింది ఒకరిద్దరు కాదు.. ఏకంగా 5 లక్షల మంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెయిల్స్‌కు ఈ స్థాయిలో మెయిల్స్ రావడం ఇదే ప్రథమమంటున్నారు సిఎం పేషీ అధికారులు. మెయిల్స్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నామని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి చిన్న లడ్డూను 25 రూపాయలకు బదులు 50 రూపాయలు, పెద్ద లడ్డూను 100కు బదులు రెండు వందల రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. ఇలా రేట్లను పెంచుకుంటే పోతే తమ పరిస్థితి ఏంటని సామాన్యభక్తులు మెయిల్స్ ద్వారా సమాచారం పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments