Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పోటెత్తిన భక్తులు, రోడ్లపైకి వచ్చిన భక్తుల క్యూలైన్లు

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:31 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉన్న రద్దీని పోలిస్తే సోమవారానికి మరింత పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద తితిదే ఏర్పాటు చేసిన క్యూలైన్లు కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గంటలకు గంటలు రోడ్లపైనే దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు.
 
సోమవారం ఉదయం 5 గంటల నుంచి కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి రెండు కిలోమీటర్లకు క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల పరిస్థితి అదే. అలిపిరి పాదాలమండపం, శ్రీవారి మెట్ల గుండా వందలాదిమంది భక్తులు గోవిందనామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు చేరుకుంటున్నారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల్లోను, కాలినడక భక్తులకు 9 గంటల్లో దర్శనం చేయిస్తామని తితిదే చెబుతోంది. గదులు ఖాళీ లేవు. 
 
ఎక్కడ చూసినా రద్దీ రద్దీ. తలనీలాల వద్ద భక్తులే భక్తులు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు.  విఐపిల తాకిడి కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తితిదే మాత్రం ఎప్పటిలాగే చేతులెత్తేసింది. గదులు లేక భక్తులు రోడ్లపైనే పడిగాపులు. అర్థరాత్రి నుంచి భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలని తితిదే ప్రయత్నం చేస్తోంది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

తర్వాతి కథనం
Show comments