తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... తలనీలాల విక్రయం ద్వారా రూ.7.96 కోట్ల ఆదాయం

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:12 IST)
వరుసగా సెలవు రోజులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు ప్రకటించిన మొదట్లో పెద్దగా భక్తుల రద్దీ లేకపోయినా ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శుక్రవారం సర్వదర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటలకు పైగా దర్శన సమయం పడుతోంది. అలాగే నడకదారి భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 72,279 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.39 లక్షలు వచ్చింది. 
 
కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే కోటాను కోటి భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదేకు రూ.7.96 లక్షల ఆదాయం గడించింది. తలనీలాలను మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్ల వెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహిస్తారు. 
 
తలనీలాలలో మొదటి రకం 931 అంగుళాలపైన, రెండో రకం 16 నుంచి 30 అంగుళాలు, మూడో రకం 10 నుంచి 15 అంగుళాలు, నాలుగో రకం 5 నుంచి 9 అంగుళాలు, ఐదో రకం ఐదు అంగుళాలు కన్నా తక్కువ తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే జన్మలో మళ్లీ నీ కడుపులోనే పుట్టి, నీకు ఇలాంటి బాధను కలిగించను

కేతన్ హత్య : సోదరి నిలదీతతో హత్యగా మారిన సెల్ఫీ ప్రమాద కేసు

తప్పిపోయిన తుని పాప సెప్టెంబరు లోపు తిరిగి వస్తుందని జ్యోతిష్యుడు జోస్యం

కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు స్థానాలు

పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

తర్వాతి కథనం
Show comments