Webdunia - Bharat's app for daily news and videos

Install App

రద్దీ బాబోయ్.. రద్దీ... తిరుమల క్యూ లైన్లకు తాళాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ రద్దీని నివారించడం తితిదే అధికారులకు సాధ్యపడటం లేదు. ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ..

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (12:27 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ రద్దీని నివారించడం తితిదే అధికారులకు సాధ్యపడటం లేదు. ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. రద్దీని క్రమబద్ధీకరించడం అసాధ్యంగా మారుతోంది. దీంతో క్యూలైన్లకు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నాలుగు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో తొలి రోజే తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఉదయం 8 గంటల సమయానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్టుమెంట్లూ నిండిపోగా, ఆపై గంట వ్యవధిలోనే భక్తుల క్యూ లైన్ 2 కిలోమీటర్లకు పైగా పెరిగిపోయింది. దీంతో భక్తుల రద్దీని తట్టుకోవడం క్లిష్టతరం కావడంతో టీటీడీ సిబ్బంది క్యూ లైన్లకు తాళాలు వేశారు. 
 
మరోవైపు వేలాది మంది తాళాలు వేసిన ప్రాంతాల్లో తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. ఇంకోవైపు కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే నేటి 20 వేల టికెట్ల కోటా కూడా పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మరోపక్క వర్షం కూడా పడుతూ ఉండటంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లతో పాటు పలు ప్రాంతాల్లో అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. ఈ రద్దీ మంగళవారం వరకూ కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments