తిరుమలకు తుపాకీతో కారులో... అడిగితే సైలెంటుగా కూర్చున్న కపుల్...(వీడియో)
తిరుపతిలోని అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద మరోసారి తనిఖీల్లో తుపాకీ లభ్యమవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక భక్తబృందం కారులో తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. టిటిడి సెక్యూరిటీ అధికారుల తనిఖీల్లో భక్తుల కార
తిరుపతిలోని అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద మరోసారి తనిఖీల్లో తుపాకీ లభ్యమవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక భక్తబృందం కారులో తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. టిటిడి సెక్యూరిటీ అధికారుల తనిఖీల్లో భక్తుల కారులో ఆరు తుపాకీ గుళ్లు లోడింగ్ చేసిన తుపాకీ కనిపించింది. మొత్తం ఆరు బుల్లెట్లతో పాటు గన్‌ను టిటిడి సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు నిందితులు భార్యాభర్తలుగా పోలీసులు చెబుతున్నారు. గన్‌కు లైసెన్స్ ఉందా లేదా.. అసలెందుకు గన్‌ను తిరుమలకు తీసుకెళుతున్నారన్న కోణంలో టిటిడి సెక్యూరిటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత మరో 8 బుల్లెట్లను తిరుపతిలోని అన్నారావు సర్కిల్‌లో పడేసినట్లు టిటిడి విజిలెన్స్, నిఘా అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో టిటిడి సెక్యూరిటీ అధికారులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.