Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజా... నువ్వు దానికి పనికిరావు.. జగన్ మోహన్ రెడ్డి?

ఇప్పటికే రోజాపై కోపంతో ఉన్నారు జగన్. వైసిపిలో రెండవ స్థాయి నేతగా ఎదగాలన్న ఆశతో రోజా ఉంటే జగన్ మోహన్ రెడ్డికి మాత్రం అది ఏమాత్రం ఇష్టం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతోమంది సీనియర్లను కాదని రోజా ఇష్టానుసారంగా మాట్లాడటం, పార్టీ నిర్ణయాలను ఆమే స్వయంగా

Advertiesment
రోజా... నువ్వు దానికి పనికిరావు.. జగన్ మోహన్ రెడ్డి?
, బుధవారం, 9 ఆగస్టు 2017 (19:38 IST)
ఇప్పటికే రోజాపై కోపంతో ఉన్నారు జగన్. వైసిపిలో రెండవ స్థాయి నేతగా ఎదగాలన్న ఆశతో రోజా ఉంటే జగన్ మోహన్ రెడ్డికి మాత్రం అది ఏమాత్రం ఇష్టం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతోమంది సీనియర్లను కాదని రోజా ఇష్టానుసారంగా మాట్లాడటం, పార్టీ నిర్ణయాలను ఆమే స్వయంగా వెల్లడించేయడం, పార్టీ నేతలకు చెప్పకుండా ప్రెస్ మీట్లు పెట్టేయడం లాంటివి జగన్ మోహన్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదట. జబర్దస్త్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే రోజా పార్టీ గురించి గత కొన్ని నెలల ముందు నుంచి పట్టించుకోకపోవడంతో జగన్‌కు బాగా కోపమొచ్చిందట. 
 
దీంతో రోజాను పిలిచి చడామడా చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలు త్వరలో జరుగనుండటంతో రోజాను మూడురోజుల పాటు పర్యటించమని జగన్ చెప్పారట. దీంతో రోజా మూడురోజుల పాటు నంద్యాలలో పర్యటించి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసింది. నంద్యాల నియోజకవర్గంలో పర్యటించకుండానే అలా.. ఇలా తిరిగేసి, మీడియా ప్రతినిధులతో మాట్లాడేసి రోజా వచ్చేశారని కొందరు జగన్ మోహన్ రెడ్డి చెవికి చేరవేశారట. ఈ విషయం జగన్‌కు తీవ్రంగా కోపం తెప్పించిందట.
 
నియోజకవర్గంలో పర్యటించి వైసిపి అభ్యర్థి గురించి, వైసిపి పార్టీ గురించి ప్రజలకు వివరించకుండా నంద్యాల గెస్ట్ హౌస్‌లో కూర్చుని మీడియాతో మాట్లాడితే సరిపోతుందా రోజా అని ప్రశ్నించారట జగన్. నువ్వు అస్సలు ప్రచారానికి పనికిరావంటూ ముఖం మీదే చెప్పేశారట. ఎంత తిట్టినా రోజా మాత్రం పట్టించుకోకుండా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీరందరినీ నమ్ముకోవడం అనవసరమని 20వ తేదీ వరకు నంద్యాలలో జగన్ పర్యటిస్తూ వైసిపి అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ నీకది కోసేస్తాం.. ఎవరు?