కరోనావైరస్ అంతరించాలని నెలరోజుల పాటు తిరుమలలో సుందరకాండ..? (Video)

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (18:23 IST)
కరోనా వైరస్ నుంచి బయటపడాలని ఎంతోమంది దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు..పూజలు కూడా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత నెల 11వ తేదీన ధన్వంతరి యాగం మహామంత్రం ప్రారంభించారు. ప్రతిరోజు కూడా ఆలయం ముందు వేదాలను పఠిస్తూ స్వామివారిని వేడుకున్నారు. 
 
నేటితో మహామంత్రం పూర్తి కావడంతో తిరుమల టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. సృష్టిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని.. సుందరకరాండ ప్రథమ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాలతో అఖండ పారాయణం నిర్వహించినట్లు టిటిడి అదనపు ఈఓ తెలిపారు.
 
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ ప్రథమ సర్గ అఖండ పారాయణంలో అదనపు ఈఓ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఈఓ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై యోగవాశిష్టం.. శ్రీ ధన్వంతరి మహామంత్రంను 62 రోజుల పాటు పారాయణం చేసినట్లు చెప్పారు.
 
ప్రపంచాన్ని కరోనా నుంచి రక్షించేందుకు ప్రముఖ పండితుల సూచనల మేరకు జూన్ 11వ తేదీ నుంచి సుందరకాండ పారాయణం ప్రారంభించామన్నారు. ఇందులోని శ్లోకాలను భక్తులతో పలికించి అర్థతాత్పర్యాలతో పాటు ఆ శ్లోక ఉచ్చరణ వల్ల కలిగే ఫలితం, నేటి ఆధునిక సమాజంలోని మానవాళికి ఏ విధమైన సందేశం ఇస్తుందో వివరిస్తూ ప్రతిరోజూ 10 శ్లోకాలను నిరంతరాయంగా పఠించామన్నారు. 
 
అఖండ పారాయణంలో 108 మంది వేదపండితులు, ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద అధ్యయన సంస్థకు చెందిన వేద విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నట్లు అదనపు ఈఓ చెప్పారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

Srikakulam Temple Tragedy: కాశిబుగ్గ తొక్కిసలాట.. పవన్, నారా లోకేష్ షాక్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments