Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Webdunia
శనివారం, 7 మే 2016 (17:41 IST)
తితిదే అనుబంధంగా ఉన్న న్యూడిల్లీలోని గోల్‌ మార్కెట్‌ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే 19వ తేదీ నుంచి 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ధార్మిక సంస్థ సిద్ధమైంది. మే 18వ తేదీన అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
బ్రహ్మోత్సవాల్లో బాగంగా మే 15వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 19వ తేదీన ఉదయం 9 గంటల 29 నిమిషాలకు మిథున లగ్నంలో ధ్వజారోహణం ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. 
 
19వ తేదీ ధ్వజారోహణం, 20వ తేదీ చిన్నశేషవాహనం, 21వ తేదీ సింహవాహనం, 22వ తేదీ కల్పవృక్షవాహనం, 23వ తేదీ పల్లకీ ఉత్సవం, 24వ తేదీ హనుమంత వాహనం, 25వ తేదీ సూర్యప్రభవాహనం, 26వ తేదీ రథోత్సవం, 27వ తేదీ చక్రస్నానం వాహనాలను తితిదే ఊరేగించనుంది. 
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 23వ తేదీన పుష్పయాగంను కూడా తితిదే నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కళ్యాణోత్సవం, మే 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పుష్పయాగాన్ని జరుపనున్నారు. అలాగే సాయంత్రం వూంజల్‌ సేవను కూడా తితిదే నిర్వహించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments