ధర్మప్రచారానికి వారధిగా శుభప్రదం బోధకులు నిలవాలి : తితిదే ఈఓ సాంబశివరావు

Webdunia
శనివారం, 7 మే 2016 (16:51 IST)
సనాతన ధర్మప్రచారానికి వారధులుగా శుభప్రదం బోధకులు నిలవాలని తితిదే ఈఓ సాంబశివరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం శుభప్రదం బోధకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శుభప్రదంలో శిక్షణ పొందిన బోధకులు తమ జిల్లాలోని శుభప్రదంలో పాల్గొనే ఇతర అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. బోధకులు పాఠ్యాంశాలను సరళమైన పద్ధతిలో బోధించి ఎక్కువమంది విద్యార్థులు స్ఫూర్తి పొంది, మార్గదర్శకంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సూచించారు.
 
అధ్యాపకులు, పాఠ్యాంశాలు సరళమైన పద్ధతులతో బోధించాలని అందుకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. శుభప్రదంలోని బోధన అంశాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రసారం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రజలు తెలుసుకుంటారని ఈఓ తెలిపారు. శుభప్రదం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 60 కేంద్రాల్లో 23 వేల మంది 8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు మే 22 నుంచి 29వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

దేశంలోనే అత్యంత ధనిక రాజ్యసభ్యుడు ఎవరో తెలుసా? మన తెలుగు నేతే!

Pawan Kalyan: పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ దీక్ష

మిరప ఎగుమతుల్లో పురుగుమందు.. సమస్య పరిష్కారానికి ఏపీ కమిటీ

6జీ, ఏఐ క్వాంటం టెక్నాలజీస్ కోసం రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

తర్వాతి కథనం
Show comments