ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం - ముత్యాల తలంబ్రాలతో సీఎం రేవంత్!

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (07:51 IST)
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ యేడాది శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం నిర్వించేందుకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. శ్రీరాముల వారికి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. 
 
ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహించి, అదేరోజున మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ మండపంలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మరుసటి రోజు 18న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరుపుతారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 9న క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభమవుతాయి. 
 
ఈ క్రమంలో 13న బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 14న ధ్వజపట లేఖనం, 15న ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, 16న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. 19న మహదాశీర్వచనం, 20న తెప్పోత్సవం, దొంగలదోపు, 21న ఊంజల్‌ సేవ, 22న వసంతోత్సవం, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీపుష్ప యాగం నిర్వహించనున్నారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరిగే ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు నిత్యకల్యాణాలు, 13 నుంచి 23 వరకు దర్బారు సేవ, ప్రభుత్వోత్సవం నిలిపివేయనున్నారు. మే 2న నూతన పర్యంకోత్సవం నిర్వహించనున్నారు.
 
కాగా, ఈ యేడాది శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో వస్తారని రామభక్తులు ఎదురుచూస్తున్నారు. 2016లో శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి సీఎం కేసీఆర్‌ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

15-10-2025 బుధవారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

తర్వాతి కథనం
Show comments