Webdunia - Bharat's app for daily news and videos

Install App

20న ప్రత్యేక దర్శన టిక్కెట్ల కోటా విడుదల : తితిదే

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (07:32 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను శనివారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను శనివారం ఉదయం 9 గంటలకు వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. 
 
రోజుకు 25 వేల టికెట్ల చొప్పున నెల రోజుల కోటా అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం తర్వాత తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ అద్దె గదుల కోటాను రిలీజ్‌ చేయనుంది. భక్తులు విషయాన్ని గమనించి వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో భక్తులు తప్పనిసరిగా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. 
 
మరోవైపు, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు లభించినట్టు టీటీడీ ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న 50,476 మంది భక్తులు సమర్పించిన కానుకలతో పాటు నిల్వ ఉన్న నాణేలను కూడా గురువారం లెక్కించగా రూ.5.21 కోట్ల ఆదాయం లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

తర్వాతి కథనం
Show comments