శ్రీవారి సేవలో వృద్ధులు.. నెలలో రెండు రోజులు ప్రత్యేక దర్శనం

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (17:12 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటివారికోసం తితిదే బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 
 
ఇకపై వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా తితిదే బోర్డు ఏర్పాట్లు చేసింది. నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ కార్యక్రమ దిగ్విజయంగా నడుస్తుంది కూడా. ఇందులోభాగంగా అక్టోబరు 15, 29 తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. 
 
ఈ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లు జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తితిదే బోర్డు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అదేవిధంగా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు అక్టోబరు 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

నీట్ యూజీ పరీక్ష రద్దు... ఫీజు వాపసు గడువు జూన్ 22కి పెంపు

ఎన్టీఆర్ 103వ జయంతి.. చంద్రబాబు నివాళి.. మహానాడు ఏం టెక్నాలజీ గురూ..

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments