Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం ఎక్కువే

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (16:59 IST)
అసలే కరోనా. రెండు నెలల పాటు ఆలయం మూసివేత. టిటిడిలో ఉద్యోగులకు జీతాలు ఇస్తారో లేదోనన్న ఒక అనుమానం. 14 వేల మంది కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ కార్మికులు, 7 వేలకు పైగా పర్మినెంట్ కార్మికులు ఉన్నారు. అయితే హుండీ ఆదాయంతోనే అందరికీ జీతాలు. ఆధ్యాత్మిక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంటుంది.
 
అయితే కరోనా పుణ్యమా అని ఆలయంలో కైంకర్యాలన్నీ యథావిధిగా సాగాయి కానీ భక్తులను మాత్రం అనుమతించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల సడలింపులతో మళ్ళీ ఆలయం తెరుచుకుంది. ప్రస్తుతం సామాజిక దూరం పాటిస్తూ తక్కువ సంఖ్యలోనే భక్తులు శ్రీవారిని దర్సించుకుంటున్నారు.
 
ఆన్లైన్, ఆఫ్ లైన్లో టిక్కెట్లను టిటిడి అందిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులకు త్వరితగతిన దర్సన భాగ్యం లభిస్తోంది. అయితే హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. గతంలో రద్దీ సమయంలోనే ప్రతిరోజు కోటి నుంచి కోటిన్నర వరకు వచ్చేది. ఇక శని, ఆదివారాలైతే మూడు కోట్ల వరకు హుండీ ఆదాయం వచ్చేది.
 
ప్రస్తుతం భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. అయినా సరే హుండీ ఆదాయం అర కోటి వరకు వస్తోంది. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 57 లక్షల రూపాయలు వచ్చింది. ఆలయం తెరిచినప్పటి నుంచి హుండీ ఆదాయం పెరుగుతూనే ఉందని టిటిడి అధికారులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా స్వామివారికి మ్రొక్కులు సమర్పించుకోలేని భక్తులందరూ ప్రస్తుతం మ్రొక్కులు సమర్పించుకోవడం వల్లనే హుండీ ఆదాయం పెరుగుతోందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

అన్నీ చూడండి

లేటెస్ట్

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

తర్వాతి కథనం
Show comments