Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న హుండీలో పాతనోట్లు.. తీసుకునేది లేదన్న ఆర్బీఐ.. తలపట్టుకున్న టీటీడీ

తిరుమల వెంకన్న స్వామి హుండీలో పడిన భారీ పాత నోట్లను మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మల్లగుల్లాలు పడుతోంది. నోట్ల రద్దు కారణంగా వెంకన్న హుండీ ఆదాయం బాగా పడిపోయింది. కానీ శ్రీవారి హుండీలో పాత నోట్ల

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (13:03 IST)
తిరుమల వెంకన్న స్వామి హుండీలో పడిన భారీ పాత నోట్లను మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మల్లగుల్లాలు పడుతోంది. నోట్ల రద్దు కారణంగా వెంకన్న హుండీ ఆదాయం బాగా పడిపోయింది. కానీ శ్రీవారి హుండీలో పాత నోట్లు కట్టలు కట్టలుగా పడినాయి. ఇవన్నీ పాత రూ.500, రూ.1000 నోట్లే. వాటిన్నింటినీ లెక్కగడితే నాలుగు కోట్ల రూపాయలుగా తేలింది. వాటిని ఏం చేయాలో తెలియక టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ గత రెండు నెలల్లో హుండీలోకి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
వాటిని మార్చేందుకు సమయం ముగిసిపోయినా.. వాటిని ఏం చేయాలో తెలియక టీటీడీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖలు రాశారు. అయితే పాత నోట్లను స్వీకరించేందుకు బ్యాంకులతో పాటు ఆర్‌బీఐ నిరాకరించడంతో టీటీడీ గందరగోళంలో పడింది. పేరుకుపోయిన పాత నోట్లను ఏం చేయాలో తెలియక టీటీడీ తర్జనభర్జన పడుతోంది. 
 
తిరుమల వెంకన్నకు రోజూ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల దాకా స్వామివారికి ఆదాయం వస్తుంది. గత ఏడాది నవంబర్ 8వ తేదిన కేంద్రం పెద్దనోట్ల రద్దు చేయడంతో.. శ్రీవారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అనుకున్నారు. కానీనోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో కానుకలు అటుంచి కొండకు వచ్చే భక్తులు సంఖ్య సగానికి తగ్గింది. దీంతో ఆదాయం తగ్గడంతో టీటీడీ ఆలోచనలో పడింది. పాత నోట్లే రూ.4కోట్లు హుండీల్లో పడిపోయాయి. దీంతో హుండీలో పడిన మొత్తాన్ని మార్చుకునేందుకు ఆర్బీఐతో పాటు కేంద్రానికి కూడా టీటీడీ అధికారులు లేఖ రాశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments