Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నులపండువగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (20:04 IST)
కలియుగ వేంకటేశ్వరస్వామి పట్టపురాణి పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా శాస్త్రోక్తంగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు జరిగాయి. ఏకాంతంగానే ఈ కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తోంది.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.  ఉదయాన్నే ఆలయంలోని శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. టిటిడి పాంచరాత్ర ఆగమ పండితుల పర్యవేక్షణలో బుత్వికులు చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి, హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు.
 
ఇందులో భాగంగా 120మంది కోటి అర్చన, 36మంది హోమం, 12మంది భాష్యం, రామాయణం, భాగవతం, మహాభారతం పారాయణం, 12మంది జపం, 12మంది ఆవుపాలతో తర్పణం నిర్వహిస్తున్నారు.
 
వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఏకాంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా భక్తుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం గత యేడాది నుంచి కోవిడ్ కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ససోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

నడి రోడ్డుపై ఘోరంగా తన్నుకున్న ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

తర్వాతి కథనం
Show comments