వ్యాక్సిన్ వేసుకుంటేనే జూలై నెల జీతం : తితిదే కఠిన నిర్ణయం

Webdunia
గురువారం, 1 జులై 2021 (13:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది. తితిదేలో పని చేస్తున్న వారిలో 45 యేళ్లుదాటిన వారంతా విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేసింది. అలాంటి వారికి మాత్రం జీతం ఇస్తామని తేల్చి చెప్పింది. 
 
టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 సంవత్సరాలు పైబడి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. చాలామంది ఉద్యోగులు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని గుర్తించిన టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
 
కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నాయి. 
 
అయితే ఉచితంగా వద్దు అనుకున్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రుసుము చెల్లించి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థలతో పాటు అనే కంపెనీలు తమ ఉద్యోగులకు కార్యాలయాల్లోనే వ్యాక్సిన్లు వేయిస్తున్నాయి. 
 
ఈ కోవలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగులకు గట్టి ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 సంవత్సరాలు పైబడి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 
 
చాలామంది ఉద్యోగులు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని గుర్తించిన టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జులై 7 లోపు ఆ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకుని సంబంధిత సర్టిఫికెట్లను ఆయా డిపార్ట్‌మెంట్లలో అందజేయాలని ఈవో ఆదేశించారు. జులై 7 లోపు వ్యాక్సిన్ వేసుకున్న ఉద్యోగులకు జూలై 8న జీతాలు చెల్లించాలని ఈవో ఆదేశాలు జారీ చేసారు. 
 
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. త్వరలోనే సర్వదర్శనం కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు అలసత్వం వహిస్తుండటంతో ఈవో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

19న జనవరి కోటా శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

తర్వాతి కథనం
Show comments