Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎనిమిది దేశాలు, 13 నగరాల్లో కళ్యాణోత్సవం

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (13:40 IST)
శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రపంచ వ్యాప్తంగా శ్రీనివాస కల్యాణోత్సవం జరుగనుంది. నవంబర్ 9, 2024 నుండి డిసెంబర్ 21, 2024 వరకు ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీ వేంకటేశ్వర శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నట్లు ఎన్ఆర్ఐ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ప్రకటించారు. 
 
దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో జర్మనీలోని శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్‌కు చెందిన కార్యక్రమ సమన్వయకర్త సూర్య ప్రకాష్ వెలగా, వెంకట కృష్ణ జవాజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (జిఎడి పొలిటికల్) కె. సురేష్ కుమార్, ఎపిఎన్‌ఆర్‌టిఎస్ సిఇఒ పి.హేమలత రాణి తదితరులు పాల్గొన్నారు. 
 
ఏపీఎన్నార్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ), తిరుమల తిరుపతి దేవస్థానాలు,  అతిధేయ దేశాల్లోని స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి యూకే, ఐర్లాండ్, యూరప్‌లలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించబడుతున్నాయి. 
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని కల్యాణాల్లో భక్తులకు ప్రవేశం ఉచితం. తిరుమలకు చెందిన టీటీడీ అర్చకులు, వేదపండితులు అన్ని దేశాల్లో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం క్రతువులను నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ పుంజుకుంటోందా?

యూరిన్ బాటిళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం సిద్ధం వున్నాము: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

నటుడు దర్శన్‌కు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు

పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. విజయవాడ టు కలకత్తా.. పాదయాత్ర (video)

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

అక్టోబర్ 29న ధన త్రయోదశి.. ఇవి కొనండి.. ఇవి కొనొద్దు..

28-10-2024 సోమవారం దినఫలితాలు - అత్యుత్సాహం ప్రదర్శించవద్దు...

ఈ నెల 31వ తేదీన వీఐపీ దర్శనాలు రద్దు.. ఎందుకో తెలుసా?

27-10-2024 ఆదివారం దినఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం...

27-10- 2024 నుంచి 02-11-2024 వరకు ఫలితాలు-ఆర్థికంగా బాగుంటుంది

తర్వాతి కథనం
Show comments