Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Webdunia
మంగళవారం, 17 మే 2016 (15:47 IST)
సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకున అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి కోయిల్‌ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి వస్తువులను నీటితో శుద్ధి చేశారు. 
 
నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మే 19వ తేదీ అంకురార్పణతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
ఉత్సవాల్లో భాగంగా మే 21వ తేదీన ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నుపండువగా జరుగనుంది. సాయంత్రం 3 గంటల నుంచి 4.30 గంటల మధ్య శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని తితిదే నిర్వహించనుంది. అలాగే రాత్రి 7 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమ్మవారిని నాలుగు మాడా వీధుల్లో ఊరేగించనున్నారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments