Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్పవృక్షవాహనంపై ఊరేగిన గోవిందరాజస్వామి

Webdunia
మంగళవారం, 17 మే 2016 (15:50 IST)
తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లు కల్పవృక్ష వాహనంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు ఠీవీగా కదులుతుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 
 
కల్పవృక్ష వాహన ప్రాశస్త్యాన్ని పరికిస్తే... ప్రకృతికి శోభను సమకూర్చేదే చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాకుండా కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్ర మథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే కోనేటిరాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించడమే ఈ వాహన్ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

అన్నీ చూడండి

లేటెస్ట్

దుర్గామాత అనుగ్రహం కోసం అఖండ దీపం వెలిగిస్తే..?

04-02- 2025 మంగళవారం దినఫలితాలు : రుణసమస్యలు కొలిక్కివస్తాయి...

రథ సప్తమి: సూర్యునికి ఇలా పూజ.. చిక్కుడు కాయలు, పరమాన్నం...

స్కంధ షష్టి - కుమారస్వామి పూజతో అంతా జయం

సోమవారం వ్రతం విశిష్టత- అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు..

తర్వాతి కథనం
Show comments