శ్రీవారి భక్తులకు శుభవార్త - ఉచిత దర్శన టిక్కెట్లు జారీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:45 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులకు ఉచిత దర్శన టిక్కెట్లను జారీచేసింది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ చేసేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి జారీ చేసే ఈ టోకన్లను తీసుకున్నవారికి బుధవారం నుంచి దర్శనం కల్పిస్తారు. 
 
అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి, సత్రాల వద్ద టోకెన్లను జారీచేస్తారు. ఈ ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా పడుతున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్ని నెలలుగా ఉచిత దర్శనం నిలపివేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో కేవలం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను జారీ చేస్తూ, వాటిని తీసుకున్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తూ వచ్చారు. ఇకపై, సాధారణ భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే చర్యలు తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : జగన్‌పై చంద్రబాబు ఘన విజయం

Jagan: పులివెందులలో వలసలు.. టీడీపీలో చేరిన చంద్రశేఖర్ రెడ్డి.. జగన్‌కు షాక్

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పిటిషన్లు - స్పీకర్ సంచలన తీర్పు

మానవత్వం మరుగయిపోతుందా? రోడ్డుపై గుండెపోటుతో వ్యక్తి, అతడి భార్య సాయం అర్థిస్తున్నా... (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

15-12-2025 సోమవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

14-12-2025 నుంచి 20-12-2025 వరకు మీ వార రాశిఫలాలు

14-12-2025 ఆదివారం ఫలితాలు - పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు...

13-12-2025 శనివారం ఫలితాలు - సర్వత్రా అనుకూలం.. కష్టం ఫలిస్తుంది...

డిసెంబర్ 13, 2025, శనివారం, కృష్ణపక్ష నవమి: పది రూపాయలు ఖర్చు చేసి.. ఈ దీపాన్ని వెలిగిస్తే..?

తర్వాతి కథనం
Show comments