Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ధనప్రసాదానికి విశేష స్పందన

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (18:56 IST)
తిరుమల శ్రీవారి ధనప్రసాదానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుమలలో భక్తులకు అందిస్తున్న ధనప్రసాదాన్ని పోస్టల్ ద్వారా పంపించాలన్న విజ్ఞప్తులు టిటిడికి అందుతున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తిరుమలకు వచ్చిన భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని చెబుతున్నారు.
 
తిరుమల శ్రీవారి హుండీలో లభించే చిల్లర నాణేలను ధనప్రసాదంగా భక్తులకు అందిస్తోంది టిటిడి. స్వామివారికి నిత్యం 8 లక్షల నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు కానుకగా లభిస్తాయి. వాటిని కానుకల ద్వారా మార్పిడి చేసుకుంటోంది టిటిడి.
 
మూడేళ్ళ క్రితం టిటిడి వద్ద దాదాపు 60 కోట్ల చిల్లర నాణేలు పేరుకుపోయాయి. మళ్ళీ రెండేళ్ళలో దాదాపు 50 కోట్ల వరకు చిల్లర నాణేలను మార్పులు చేయించారు అదనపు ఈఓ దర్మారెడ్డి. మరోవైపు స్వామివారికి లభించిన నాణేలను ధనప్రసాదంగా అందించాలని భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని వాటిని భక్తులకు అందించేందుకు ప్రారంభించింది టిటిడి. తిరుమలలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసింది. పసుపు..కుంకుమ అక్షింతలతో కూడిన నాణేలను తీసుకునేందుకు భక్తులు ఆశక్తి చూపుతున్నారు. 
 
100 రూపాయల ప్యాకెట్ చొప్పున భక్తులకు అందిస్తూ ఉండడంతో రోజుకు 2 లక్షల వరకు చిల్లర నాణేలు భక్తులకు చేరుతున్నాయి. మరోవైపు కోవిడ్ నిబంధనల కారణంగా తిరుమలకు రాలేని భక్తులు తమకు దనప్రసాదాన్ని పోస్టు ద్వారా అందించాలని టిటిడికి విజ్ఞప్తి  చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?

05-11-2024 మంగళవారం ఫలితాలు : కార్యసాధనలో సఫలీకృతులవుతారు...

మీ దగ్గర తీసుకున్న డబ్బు ఎవరైనా ఇవ్వకపోతే..?

విశాఖ నక్షత్రంలోకి సూర్యుని పరివర్తనం.. 3 రాశులకు అదృష్టం

కార్తీకమాసంలో ఛట్ పూజ.. సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తే.. రాగి నాణేలను..?

తర్వాతి కథనం
Show comments