Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (14:11 IST)
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయ పాలకమండలి శుభవార్త చెప్పింది. ఆలయ అభివృద్ధి చర్యల్లో భాగంగా కొత్త డిజైన్‌ను రూపొందించారు. ఇందులోభాగంగా, సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైవర్‌ను తొలగించనున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వానిసన్నిధిలోకి అనుమతిస్తారు. 
 
ఇప్పటివరకు భక్తులు పదునెట్టాంపడి ఎక్కగానే ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఉండే ఫ్లై ఓవర్ మీదుగా సన్నిధానం చేసుకోవాల్సి వచ్చింది. ఇపుడు వంతెనను తొలగించడంతో మెట్లు ఎక్కువగానే స్వామి దర్శనం చేసుకోవచ్చు. 
 
మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. అపుడు ఇరుముడితో వెళ్లే 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్లదారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్‌పుర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్పసన్నిధి చేరుకోవచ్చు. 
 
ప్రస్తుతం ఫ్లై ఓవర్ దిగాక అయ్యప్పసన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినపుడు మాత్రమే రెండుమూడు సెకన్ల పాటు స్వామి దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కేది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

Mulugu: తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. ములుగులో హై అలెర్ట్ (video)

కాఫీ బెర్రీ బోరర్ నుంచి అరకు కాఫీకి సరికొత్త ముప్పు

తెలంగాణలో భారీ వర్షాలు.. నీట మునిగిన ఆరు జిల్లాలు, ఆరుగురు మృతి

Jagan: చంద్రబాబుపై జగన్ విమర్శలు.. 14 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.

Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments