Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి వద్ద ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే తిరుమల కొండపైకి ఎంట్రీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (19:57 IST)
కోవిడ్ కేసులు తగ్గిపోయాయి.. ఇక ఏముందిలే..తిరుమల దర్సనానికి ఇలా వెళ్ళి అలా వచ్చేయవచ్చు అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, రెండు డోస్‌ల సర్టిఫికెట్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ టిటిడి మాత్రం ఆ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.

 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులు తూచా తప్పకుండా ఆ రెండింటిలో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకురావాలని స్పష్టం చేస్తోంది. తిరుపతిలోని అలిపిరి వద్దే ఆ సర్టిఫికెట్లను తనిఖీ చేసి పంపించనున్నారు టిటిడి సెక్యూరిటీ అధికారులు.

 
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి. ఈ విషయాన్ని ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రెండు సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా భక్తులను తిరిగి పంపించేస్తామని స్పష్టం చేశారు.

 
ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు టిటిడి అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

తర్వాతి కథనం
Show comments