Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్చువల్ సేవా టిక్కెట్లు హాంఫట్, మరి దర్సనం ఎలా గోవిందా?

వర్చువల్ సేవా టిక్కెట్లు హాంఫట్, మరి దర్సనం ఎలా గోవిందా?
, గురువారం, 23 డిశెంబరు 2021 (22:22 IST)
ఆన్లైన్లో టిక్కెట్లను విడుదల చేయడమే ఆలస్యం హాట్ కేకుల్లా టిక్కెట్లు మొత్తం అయిపోతున్నాయి. అది కూడా విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే టోకెన్లు కనిపించడం లేదు. ఇంటర్నెట్లో అతుక్కుని పోయి మరీ భక్తులు టిక్కెట్లను పొందుతున్నారు. వర్చువల్లో సేవా టిక్కెట్లు సాయంత్రం విడుదల చేసింది.

 
విడుదల చేసిన కొద్దిసేపటికే మొత్తం టిక్కెట్లన్నీ అయిపోయాయి. జనవరి 1, జనవరి 2, అలాగే 13వ తేదీ ఉంచి 22వ తేదీ వరకు, అలాగే 5,500 వర్చువల్ సేవా దర్సన టిక్కెట్లను విడుదల చేశారు. దీంతో ఆ సేవా టిక్కెట్లను ఎగబడీ మరీ ఇంటర్నెట్లో భక్తులు కొనేశారు.

 
ఇక రేపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను కూడా విడుదల చేయనుంది టిటిడి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సన టిక్కెట్ల కోటాను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. రోజుకు 12 వేల చొప్పున టిక్కెట్లను విడుదల చేయనున్నారు. 

 
తిరుమల వసతికి సంబంధించి డిసెంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. 

 
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్సన, వసతిని బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాకుండా చాలారోజుల తరువాత ఆఫ్లైన్లో సర్వదర్సనం టోకెన్లను ఇవ్వనుంది టిటిడి. ఈ నెల 31వ తేదీన టిటిడి వసతి సముదాయంలోని కౌంటర్ల ద్వారా టోకెన్లను అందించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల