Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రార్థన ఎంతకాలం కొనసాగాలి? దాని పర్యావసానం ఏమిటి !? (video)

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (08:45 IST)
ప్రార్థన అంటే స్వార్థంతో మన ఇష్టానికి అనుగుణంగా కాకుండా అంతర్యామిగా ఉన్న ఈశ్వర సంకల్పం మేరకు నడిపించాలని కోరుకోవటం. నిజానికి అలా కోరుకోవటం మనలో శుభేచ్ఛను కలిగించటంకోసమే. శుభేచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ.

అది అర్థమైన తర్వాత ప్రార్థన చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఆ స్థితి కలిగేవరకూ ప్రార్థనగా సాగిన భక్తి ఆ తర్వాత ఆరాధనగా పరిణమిస్తుంది. దైవం ఎడల ఆరాధనాభావం వస్తే ఆత్మీయత ఏర్పడుతుంది. అప్పుడు ప్రతీది దైవంతో చెప్పుకోవడమే కానీ అడగటం ఉండదు. అది చిన్న పిల్లవాడు స్కూల్ కి వెళుతూ 'అమ్మ వెళ్ళొస్తానని' చెప్పటం లాంటిది.

అందులో ఏ కోరిక, ప్రార్ధన లేవు. కేవలం ఆత్మీయతే ఉంది. మనకి కూడా భగవంతునితో అలాంటి ఆత్మీయత వస్తే మనకంటూ ప్రత్యేకంగా ఏ సంకల్పం ఉండదు. అదే శరణాగతి. అప్పుడు దైవంతో ఏకాత్మతాభావనే ఉంటుంది.

అందుకు మనం విశుద్ధ మనస్కులం కావాలి. దైవం అందరిలోనూ సమంగానే ఉన్నా, విశుద్ధ మనస్కుల్లో బాగా ప్రస్ఫుటం అవుతుందని భగవాన్ శ్రీరమణమహర్షి బోధించేవారు. అలా ప్రస్ఫుటమవ్వాలని ఎవరూ కోరుకోనక్కర్లేదు. అందుకే మన ప్రార్థనా విధానమంతా ఒక అంతిమ లక్ష్యంతోనే సాగుతుంది !
 

సంబంధిత వార్తలు

విమానంలో ఎంచక్కా రొమాన్స్‌.. నాలుగు గంటల పాటు..?

విమానంలో రెచ్చిపోయిన ప్రేమజంట.. రెండు సీట్ల మధ్య రొమాన్స్...ప్రయాణికులకు ఫ్రీ సినిమా!!

ఏపీలో ఇంటర్ ఫలితాలు.. షరా మూమూలే.. బాలికలదే పైచేయి..

జనసేన పార్టీకి బక్కెట్ గుర్తు టెన్షన్.. టెన్షన్.. ఏం చేయాలబ్బా!!

దేశంలో వేడిగాలులు.. ఔషధాలు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్‌లు సిద్ధమా?

చైత్ర నవరాత్రి 2024- తొమ్మిది రోజులు ఏ తల్లిని పూజించాలి..

అయోధ్యలో తొలి నవరాత్రి ఉత్సవాలు.. రామ్ లల్లా కోసం కొత్త దుస్తులు

ఏప్రిల్ 17న రామనవమి... అయోధ్య రామ్ లల్లాకు సూర్యాభిషేకం

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీ రాశి ఫలితాలు, ఆదాయం-వ్యయం ఎంతెంత?

09-04-202 మంగళవారం దినఫలాలు - వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు...

తర్వాతి కథనం
Show comments