Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట..

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (09:25 IST)
Manokamana, Shiva Puja
దేవఘర్ (జార్ఖండ్) పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ బైద్యనాథ్ భగవాన్‌కు ప్రసిద్ధి చెందింది, దీనిని మనోకామ్నా (కోరిక) లింగంగా కూడా పిలుస్తారు, ఎందుకంటే బైద్యనాథ్ భక్తుల కోరికలను నెరవేర్చడంలో ప్రసిద్ధి చెందిన వాడని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. బైద్యనాథ్ జ్యోతిర్లింగ పురాణం క్రింద ఇవ్వబడింది. 
 
రావణుడు శంకరుడిని తన దేశం లంకకు (ప్రస్తుతం శ్రీలంక) తీసుకురావాలనుకున్నాడు. కారణం ఏమిటంటే, శంకరుడు లంకలో నివసిస్తే, ఎవరూ తనపై దాడి చేయలేరని.. దేవతలు కూడా దరిచేరలేరని భావించాడు. అందుకే కైలాసానికి వెళ్లి శంకరుడిని మెప్పించడానికి కఠోర తపస్సు చేశాడు. ఆపై రావణుడికి మహేశ్వరుడు ప్రత్యక్షమై.. వరం ఏకావాలని అడుగుతాడు. అందుకు రావణుడు శంకరుడైన మీరు లంకలోనే నివాసం వుండాలని కోరుకుంటాడు. 
 
అందుకు శంకరుడు కూడా తథాస్తు అంటూ వరమిచ్చాడు. అంతేగాకుండా లంకలో నివాసముండే రీతిలో రావణునికి జ్యోతిర్లింగాన్ని ఇచ్చాడు. దానిని లంకలో ప్రతిష్టించమని చెప్పాడు. కాబట్టి శివుడు లంకలో జ్యోతిర్లింగ రూపంలో ఉంటాడు. కానీ శంకరుడు ఈ లింగాన్ని ప్రతిష్టించేంత వరకు ఈ లింగం రావణుని తలపై ఉండాలి. దానిని నేలపై వుంచితే అక్కడే అది వుండిపోతుందని షరతు ఇచ్చాడు. 
 
రావణుడు అందుకు అంగీకరించి కైలాసం నుండి లంకకు ప్రయాణం ప్రారంభించాడు. కానీ శివుడు రావణుడితో లంకలో జ్యోతిర్లింగంగా నివసించే ఏర్పడే పరిణామాల దృష్ట్యా.. రావణుడి తలపై వున్న జ్యోతిర్లింగాన్ని మహావిష్ణువు బాలుడి రూపంలో నేలపై వుంచేలా చేస్తాడు.
 
రావణుడు తిరిగి వచ్చి భూమిపై ఉన్న జ్యోతిర్లింగాన్ని చూసినప్పుడు, అతను విపరీతమైన కోపంతో దానిని ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ అతను విఫలమయ్యాడు. అతను జ్యోతిర్లింగాన్ని పైకి ఎత్తడానికి ఎంత ప్రయత్నించాడో, అది భూమిలోనికి ప్రవేశించింది. 
Manokamana Shiva Puja
 
ఆ జ్యోతిర్లింగం ఇప్పుడు కూడా అదే స్థలంలో ఉంది. ఆ జ్యోతిర్లింగాన్ని పూజించిన మొదటి వ్యక్తి 'బైద్య' (ఆయుర్వేద వైద్యుడు). శివుడు ఆ భక్తుడికి ఒక వరం ఇచ్చాడు. ఇక నుండి ఈ జ్యోతిర్లింగం శ్రీ బైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పిలువబడుతుంది. రావణుడి 'మనోకామ్న' (కోరిక) పూర్తిగా నెరవేరలేదు కాబట్టి, ఈ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగ భక్తుల కోరికలను తీరుస్తుంది. (అయితే ప్రతి జ్యోతిర్లింగం కోరికలను తీరుస్తుంది) అందుకే దీనిని "మనోకమన లింగం" అని కూడా పిలుస్తారు.
 
సౌరాష్ట్రలోని సోమనాథ్ - ఈ స్వామిని పూజిస్తే సంపద, శాంతితో ఆశీర్వదించబడతాము.
శ్రీశైలం మల్లికార్జునుడిని ప్రార్థిస్తే - పాపాల నుండి విముక్తి పొందుతాము.
ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని ప్రార్థిస్తే - అన్ని భయాలు, పాపాల నుండి విముక్తి పొందుతాము.
ఓంకారేశ్వర్ అమరేశ్వర జ్యోతిర్లింగాన్నిపూజిస్తే.. సుఖాన్ని, శాంతి, సంపద లభిస్తుంది. 
 
ఇలా దేశ వ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలు వున్నాయి. ఈ లింగాలను పూజించడం ద్వారా కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. 12 జ్యోతిర్లింగాల క్రమంలో సోమనాథ్ జ్యోతిర్లింగం మొదటిది. ఈ ఆలయం గుజరాత్‌లోని వెరావల్ బడన్‌గర్గాహ్‌కు కొద్ది దూరంలో ఉన్న ప్రభాస్ పటాన్‌లో ఉంది. అన్ని జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత శివ మహాపురాణంలో వివరించబడింది. 
 
సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. చంద్రుడు స్థాపించినందున ఈ శివలింగానికి సోమనాథ్ అని పేరు వచ్చింది. జీవితంలో శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం సోమనాథ్ జ్యోతిర్లింగ హోమాన్ని నిర్వహించి పవిత్ర ఆచారాల ద్వారా శివుడిని పూజిస్తారు.
 
జ్యోతిర్లింగాలను పూజిస్తే..
మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. 
మనశ్శాంతి లభిస్తుంది. 
ఆరోగ్యం, సౌభాగ్యం, ఆయుష్షు చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

తర్వాతి కథనం
Show comments