Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి పుణ్యకాలం అంటే..!

ప్రాచీనకాలంలో శాస్త్ర అవగాహనా అంతగా లేని కారణంగా సూర్యగ్రహాన్ని దేవునిగా భావించేవారు. సూర్యభగవానుడు వేరు సూర్యగ్రహం వేరు. ఆది - అంతములేని ఈ విశ్వంలో కోటానుకోట్ల గ్రహాలలో సూర్యగ్రహం భూమికి దగ్గరగా ఉన్న

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (12:19 IST)
ప్రాచీనకాలంలో శాస్త్ర అవగాహనా అంతగా లేని కారణంగా సూర్యగ్రహాన్ని దేవునిగా భావించేవారు. సూర్యభగవానుడు వేరు సూర్యగ్రహం వేరు. ఆది - అంతములేని ఈ విశ్వంలో కోటానుకోట్ల గ్రహాలలో సూర్యగ్రహం భూమికి దగ్గరగా ఉన్న పెద్ద గ్రహాలలో ఒకటి సూర్యభగవానుడు అదితి కస్యపు మహామునుల బిడ్డలలో ఒకడు సూర్య తేజస్సు కలిగిన ఒక దేవతామూర్తి. సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు ఒక నిర్ధిష్ట కక్ష్యలో తిరిగే గమనాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని లెక్కించే కొలమానాన్ని అనేకులు అనేక కరాలుగా తయారుచేసి నిర్ణయించారు. అందులో ముఖ్యమైనవి హిందువులు పాటించేవి సూర్యగమనాన్ని బట్టి సూర్యమానము, చంద్రునిగమనాన్ని బట్టి చంద్రమానము. ఈ రెండింటి ప్రకారమే ఈ సంక్రాంతి పుణ్యకాలం నిర్ణయిస్తారు.
 
భూమిపై మారే వాతావరణ మార్పులు బట్టి సూర్యకాంతి తీవ్రతను బట్టి, మన ప్రాచీన మునులు సంవత్సర కాలాన్ని సూర్యుడు గతి మారే 12 రాశులుగా విభజించారు. దీని ప్రకారం సూర్యుడు ఒక్కొఒక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దానినే కొందరు సంక్రాంతి అంటారు. సూర్యుడు మకరరాశిలలో ప్రవేశిస్తాడు. కావున ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు. 
 
మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూ మధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నట్లు కనిపించినప్పుడు ఉత్తరాయణం అని, సూర్యుడు భూ మధ్య రేఖకు దక్షిణంగా సంచరించి కనిపించినప్పుడు దక్షిణాయమని అని పిలిచారు. రెండు ఆయణములుగా విభజించారు. యేడాదిలో ఆరునెలలు ఉత్తరాయణం అయితే ఆరునెలలు దక్షిణాయణం. ఖగోళశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 16 నుంచి జనవరి 14వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని, జనవరి 15 నుంచి జూలై 15వరకు దక్షిణాయణం అని అంటారు. ఇంతటి మార్కుకు సంబంధించి రహస్యాన్ని లోకం లోని అతి సామాన్యులకు అర్థమయ్యేలా వివరించేందుకు పండుగను చేసుకునే అలవాటును ప్రచారంలోకి తెచ్చారు.
 
సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించు గడియలనే పుణ్యకాలం అంటారు. మన నుంచి ఉత్తరాయణములో ప్రవేశించు గడియలనే పుణ్యకాలం అంటారు. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణాయణం మేల్కొంటారని పురాణాలు తెలియచున్నాయి. ఉత్తరాయణంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని, ఈ కాలంలో మరణించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ సూత్రాలు చెబుతున్నాయి. ఈ మకర సంక్రమణము పుష్యమాసం నుంచి వస్తుంది. దక్షిణాయములో చనిపోయిన మన ఆత్మీయులు మనమిచ్చే తర్పణాలు మూలముగా ఉత్తరాయణ ప్రారంభం కాగానే తెరిచి ఉన్న ద్వారాల గుండా వైకుంఠం చేరుకుంటారని నమ్మకం. అందుకే పెద్దలకు పూజలు, కొత్త బట్టలు, నైవేథ్యాలు పెడతారు. పూజలు జరుపుతారు. అంతా నమ్మకమే. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

07-01-2025 మంగళవారం దినఫలితాలు : స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు...

Guru Gobind Singh Jayanti 2025: గురు గోవింద్ సింగ్ జయంతి.. కోట్స్ ఇవే

06-01-2025 సోమవారం దినఫలితాలు : ప్రలోభాలకు లొంగవద్దు...

తర్వాతి కథనం
Show comments