భక్తి అంటే ఏమిటి? భక్తి ఎలా ఉండాలి?

Webdunia
శనివారం, 9 మే 2020 (19:42 IST)
దేవుణ్ణి నమ్మేవాళ్ళలో రెండు రకాలు ఉన్నారు. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆయనకు రూపం ఇవ్వడమేంటి అనేవారు కొందరు. దేవుడికి ఆకారమిచ్చి, పూజలు చేసేవారు కొందరు. దేవుడి విగ్రహం ముందు కూర్చుంటే సుఖశాంతులు అనుభూతికి వస్తాయి. దేవాలయానికి వెళ్తే, మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఒక అతీతమైన శక్తి కాపాడబోతున్నట్లు, అండగా ఉన్నట్లు అనిపించి ధైర్యంగా ఉంటుంది. కొండంత ఉపశమనం కలుగుతుంది.
 
తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మంది భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటారు. బిగ్గరగా మంత్రాలు పఠించడం, పూజలు, పునస్కారాలు చేయడం, జపాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తాము అనుకున్నది సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
 
 ఇంకొంతమంది కోరిన కోరికలు నెరవేరడానికి భగవంతునికి ఉపవాసాలూ ఉంటుంటారు. పలు రకాల వ్రతాలూ చేస్తుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే కొంతమంది భక్తులు గంటలకొద్ది పూజలు, వేలకొద్ది జపాలు, అనేక వ్రతాలు, ఉపవాసాలూ చేసినా ఏ ప్రయోజనాన్ని ఆశించి చేశారో, ఆ ప్రయోజనం నెరవేరకపోవడంతో నిరాశపొందడం జరుగుతుంది.
 
భగవంతుడిని ఆరాధించే కొద్దిసేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునియందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తిగా పేర్కొంటారు. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతునికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sai Krishnaఛ సాయికృష్ణ మృతదేహాన్ని ఆ ముగ్గురు కలిసి పారేశారు..

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఐక్యంగా వుంటూ సమిష్టిగా కృషి చేయాలి.. బాబు

ప్రయాణాల్లో ఎవ్వరితో గొడవపడొద్దు, కత్తులు పెట్టుకొస్తున్నారు, పొడిచేస్తున్నారు కూడా...

చిన్నారిని గుండెలపై కాలితో తన్నిన అంగన్వాడీ టీచర్, వీడియో

వివాదాస్పద ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్ వచ్చింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

తర్వాతి కథనం
Show comments