అలాంటి బుద్ధి శక్తి కావాలి

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (21:35 IST)
మనకుండే శక్తి నాలుగు రకాలు, అవి శారీరక, మానసిక, బుద్ధిపరమైన, ఆధ్యాత్మిక శక్తి. బుద్ధిపరమైన శక్తి భౌతిక, మానసిక శక్తులకన్నా ఉన్నతమైనది. అందుచేత మన వ్యక్తిత్వంలో అది చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతి వ్యక్తిలో ఈ బుద్ధిశక్తి ఉన్నా, సరియైన శిక్షణ లేకపోవడం వలన, పదునుపెట్టకపోవడంవలన, చాలామందిలో అది నిద్రాణంగా ఉంటుంది.
 
ఆధునిక విద్యుత్ యంత్రాలను అతిగా ఉపయోగించడం వలన మానవుడు తానే ఒక యంత్రంగా మార్చబడ్డాడు. దాని ఫలితంగా కంప్యూటర్లు ప్రతి విషయాన్నితమ జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాయి. మనమేమో మన శరీరంలో ఉన్నత భాగమైన మెదడును ఖాళీగా ఉంచి, అద్దెకివ్వడానికి సిద్దమవుతున్నాము. స్వతంత్రమైన ఆలోచనలు, సృజనాత్మకత లోతుగా ఆలోచించే శక్తి మానవాళిని వదలి వాటి స్థానంలో కృత్రిమత్వం అనుకరణ, పైపైన ఆలోచించే విధానమూ ప్రతిచోటా తాండవిస్తున్నాయి.
 
మన మనస్సు, ఇంద్రియాలు చంచలంగా ఉంటాయి. ఈ రెంటికీ అతీతంగా ఆధిక్యంగా బుద్ది ఉంటుంది కాబట్టి అదే ఈ రెంటినీ మన అధీనంలోకి తీసుకురాగలదు. అందుకని అద్భుతమైన సంకల్పశక్తితో మనస్సును స్వాధీనం చేసుకొని, జీవితంలో విజయం సాధించడానికి బుద్ధిని ఉన్నత షయాలపై కేంద్రీకృతం చేయాలి.
 
బుద్ధి చేసే మరొక పని మంచిచెడుల మధ్య విచక్షణ చేయటం. మనస్సుకు ఆ శక్తి లేదు. మనకు ఏదైన సమస్య వస్తే మన మనస్సు అనేకమైన ఆలోచనలను పరిష్కార మార్గాలను సూచిస్తుంది. కాని దానిలో సరియైన దానిని ఎన్నుకొని బాధ్యత మాత్రం బుద్దిదే. ఈ ప్రపంచం మంచిచెడుల సమ్మిళితం.
 
అందుచేత విచక్షణ శక్తిని అలవరచుకుంటే తప్ప ధర్మ-అధర్మం మధ్య, న్యాయం - అన్యాయాల మధ్య సరైన నిర్ణయం చేయలేము. ఈ ఆధునిక యుగంలో ప్రతి విషయాన్ని ఎలక్ట్రాని మీడియా ద్వారా తెలుసుకుంటూ మన ఆలోచనశక్తిని మరుగున పడేనా చెస్తున్నాము. మనస్సు ఎల్లప్పుడూ మనల్ని మోసం చెయ్యడానికే ప్రయత్నిస్తుంది.
 
అడ్డదారులు త్రొక్కి సుఖవంతమైన జీవితం గడపమని అది మనకు నచ్చజెప్పుతుంటుంది. స్వేచ్ఛ పేరుతో అది ఏవిధమైన క్రమశక్షణనూ అనుసరించనివ్వక సులువైన జీవితాన్ని గడపమని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఒక్కొక్కసారి అది మనల్ని ధర్మమార్గం నుంచి దూరం చేసి చెడు విషయాలను చెయ్యమని ఒత్తిడి చేస్తుంది. అందుచేత మనస్సు యొక్క చెడు పోకడలను గమనించి దానిమీద ఆధిపత్యాన్ని చూపి, సరైన ధర్మమార్గాన్ని అవలంభించేలా చేసి నిజమైన విజయానికి దారితీసే బుద్ధిశక్తి మనకు అలవడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments