జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం?

Webdunia
ఆదివారం, 31 మే 2020 (09:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్డౌన్ మే 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ లాక్డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చింది. అలాగే, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను జూన్ ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం కూడా జూన్ 8 తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తోంది. 
 
ఇందుకోస తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోనుంది. 
 
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments