మిత్రమా.... ఎందుకు బాధ పడుతున్నావ్?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (13:27 IST)
మిత్రమా.... ఎందుకు బాధ పడుతున్నావ్... అయిందేదో అయ్యింది పోయిందేదో పోయింది. లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావ్... పోయేటప్పుడు మూటముల్లెతో పోవాలి అనుకుంటున్నావు. అందుకే నీకీ ఆరాటం, అశాంతి. నీవు ఏమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు. నీవు ఏమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్.. నీవు ఏమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడిదే ఇచ్చావు. 
 
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా.... రేపు మరి ఒకరి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు.
 
కారు లేదని చింతించవద్దు- కాలు ఉన్నందుకు సంతోషించు.
కోట్లు లేవని చితించవద్దు- కూటికి ఉంది గదా సంతోషించు.
కాలిలో ముల్లు గుచ్చుకున్నదని చింతించవద్దు- కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు.
కాలం విలువైనది- రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు.
అసూయను రూపుమాపు- అహంకారాన్ని అణగద్రొక్కు.
హింసను విడనాడు- అహింసను పాటించు.
కోపాన్ని దరిచేర్చకు- ఆవేశంతో ఆలోచించకు.
ఉపకారం చేయలేకపోయినా- అపకారం తలపెట్టవద్దు.
దేవుని పూజించు- ప్రాణికోటికి సహకరించు తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవాలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్.. మహిళను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని?

మరికొన్ని క్షణాల్లో బాంబు పేలుతుంది.. ఇస్రోకు బాంబు బెదిరింపు

డివైడర్లు ర్యాంప్ వాక్ చేసేందుకు కాదు : సీపీ సజ్జనార్ ఆగ్రహం

ఆంధ్రలో అలజడి సృష్టించేందుకు కొందరు కుట్రలు, ప్రకాష్ రాజ్‌ను నిషేధించాలి: విష్ణువర్థన్ రెడ్డి

గన్‌ఫైర్‌ను తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరిన చమురు ట్యాంకర్

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments