Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా భౌతిక దేహముతో చివరిసారిగా మానవులకు ఇచ్చిన ప్రసాదము ఇదే...

సాయినాధుడు శిరిడీలో దేహంతో ఉన్న రోజుల్లో సూర్యాస్తమయమయ్యాక మశీదులో ప్రవేశించడానికి ఆడవారిని అనుమతించేవారు కాదు. లక్ష్మీబాయి షిండే అను భక్తురాలిని మాత్రమే బాబా మశీదులో సూర్యాస్తమయమయ్యాక కూడా ఉండనిచ్చేవారు. ఆమె అందరికంటే చివరగా మశీదు విడిచి ఎవరు వెడుతు

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (12:34 IST)
సాయినాధుడు శిరిడీలో దేహంతో ఉన్న రోజుల్లో సూర్యాస్తమయమయ్యాక మశీదులో ప్రవేశించడానికి ఆడవారిని అనుమతించేవారు కాదు. లక్ష్మీబాయి షిండే అను భక్తురాలిని మాత్రమే బాబా మశీదులో సూర్యాస్తమయమయ్యాక కూడా ఉండనిచ్చేవారు. ఆమె అందరికంటే చివరగా మశీదు విడిచి ఎవరు వెడుతుంటే వారితో కలిసి తన ఇంటికి వెళ్లేది. సాయినాధుని మీద అంతటి భక్తివిశ్వాసాలు గలది లక్ష్మీబాయి షిండే. మరి ఈ భక్తురాలు బాబా కరుణాకటాక్షాలను ఎలా పొందిందో, బాబా సమాధి చెందే ముందు లక్ష్మీబాయికి ఇచ్చిన అత్యంత విలువైన ప్రసాదం ఏంటో తెలుసుకుందాం.
 
ప్రతిరోజు రాత్రి షిండేపాటిల్ భార్యయైన లక్ష్మీబాయిషిండే ఒక బార్లీ రొట్టె తెచ్చి బాబాకు సమర్పిస్తుండేది. అందుకు ఒక కారణమున్నది. ఒకరోజు సాయంత్రం బాబా మశీదులో ప్రహరీ గోడను ఆనుకుని నిలుచుని తాత్యాపాటిల్‌తో ఏమో చెబుతున్నారు. ఇంతలో లక్ష్మీబాయి వచ్చి పాదాభివందనం చేసింది. ఆప్పుడు బాబా... అమ్మా నాకు ఆకలిగా ఉంది అన్నారు. అయితే భోజనం తెచ్చేదా బాబా అన్నది లక్ష్మీబాయి. ఆ తీసుకురా అన్నారు బాబా. ఆమె ఇంటికి వెళ్లి నెయ్యి, పప్పుకూర, రొట్టె తెచ్చింది. సాయి వాటిని ఆత్రంగా అందుకున్నారు కానీ... వెంటనే ఆ వంటకాలన్నింటిని ఆయన ప్రక్కనే నిలుచున్న కుక్కకు పెట్టేశారు. లక్ష్మీబాయి నివ్వెరబోయి... బాబా మీకు ఆకలి వేస్తుంది కదా, మీరు కొంచమైన తీసుకోకుండా అంతా ఆ కుక్కకు వేశారే.... అన్నది. ఆ కుక్క రొట్టె తింటుంటే తృప్తిగా చూస్తూ సాయి..... అది మాత్రం ప్రాణే కదా.... దానికి ఆకలి ఉన్నది.
 
అది-నేను వేరు కాదు. అది తిన్నా, నేను తిన్నా ఒకటే అన్నారు. ఈ ఉపదేశం లక్ష్మీబాయి హృదయంపై చెరగరాని ముద్ర వేసుకున్నది. అప్పటినుండి ప్రతిరోజు సాయంత్రం ఆమె పాలల్లో నానబెట్టిన రొట్టె నియమంగా బాబాకు సమర్పించసాగింది. అది ఆమె నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. సంస్కారానికి, చదువుకు సంబంధం లేదు. సంస్కారం జన్మతః వచ్చేది. చదువు, వేషము అన్నవి మనం మధ్యలో తెచ్చిపెట్టుకున్నవి. లక్ష్మీబాయి ఇవేమి లేని పేదింట ఇల్లాలైనా, పల్లెపడుచైనా ఆమెలో ఎంతో సంస్కారమున్నది. గురువు యొక్క మనోభావమెరిగి ఆయనేమీ చెప్పకనే సకాలంలో తగిన సేవ చేయగలవారు శిష్యుల్లో ఉత్తములు. లక్ష్మీ బాయి బాబాపై శ్రద్దాభక్తులతో ఉత్తమ స్థాయిని చేరుకుంది. 
 
అందుకే బాబా మహా సమాధి చెందబోయే కొద్ది నిముషాల ముందు మశీదుకు చేరుకోగలిగింది. బాబా తమ జేబు నుండి ఒకసారి నాలుగు రూపాయి నాణాలు, తరువాత అయిదు రూపాయిల నాణాలను తీసి నవవిధ భక్తులకు సంకేతంగా ఆమెకు ప్రసాదించాడు. వీటిని నేటికి మనం శిరిడీలో దర్శించుకోవచ్చు. బాబా భౌతిక దేహముతో చివరిసారిగా మానవులకు ఇచ్చిన ప్రసాదము ఇదే... ఆమెలో అంత సంస్కారం ఉండబట్టే సూర్యాస్తమయమయ్యాక బాబా మశీదులోకి రానిచ్చారు. ఎప్పుడైనా ఆమె వంటకాలు తెచ్చి సమర్పించడం ఆలస్యమైతే అప్పటికప్పుడు ఏదో ఒకటి పెట్టనిచ్చేవారు శ్రీ సాయి. ఒక్కొక్కప్పుడు ఆమె ఇచ్చిన బిక్ష నుండి మూడు నాలుగు ముద్దలు మాత్రమే తీసుకుని మిగిలిన వంటకం లక్ష్మీబాయికి ప్రసాదంగా ఇచ్చేవారు బాబా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

24-11-2014 ఆదివారం వారం ఫలితాలు : కీలక పత్రాలు జాగ్రత్త.. మీ జోక్యం అనివార్యం...

24-11-2004 నుంచి 30-11-2024 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments