Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ శరీరంతో మీకేం పని... ఎక్కువ ఆలోచించవద్దు... స్వామి వివేకానంద

శరీరాన్ని గురించి మనమెంత తక్కువుగా ఆలోచిస్తే అంత మంచిది అని చెప్పారు స్వామి వివేకానంద. ఎందుకంటే మనలను క్రిందకి దిగలాగేది ఈ శరీరమే అన్నారాయన. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... సంగత్వం, దేహాత్మభ్రాంతి- ఇవే మన దుఃఖాలకు కారణం. రహస్యం ఏమిటో తెలుసా, నేనీ దేహాన్ని

ఈ శరీరంతో మీకేం పని... ఎక్కువ ఆలోచించవద్దు... స్వామి వివేకానంద
, సోమవారం, 11 జూన్ 2018 (15:38 IST)
శరీరాన్ని  గురించి మనమెంత తక్కువుగా ఆలోచిస్తే అంత మంచిది అని చెప్పారు స్వామి వివేకానంద. ఎందుకంటే మనలను క్రిందకి దిగలాగేది ఈ శరీరమే అన్నారాయన. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... సంగత్వం, దేహాత్మభ్రాంతి- ఇవే మన దుఃఖాలకు కారణం. రహస్యం ఏమిటో తెలుసా, నేనీ దేహాన్ని కాను, ఆత్మను. ఈ సమస్త ప్రపంచం, దానిలోని సర్వబంధాలు-మంచీ చెడులు, సుఖధుఃఖాలు ఇవన్నీ ఒక తెరమీద చిత్రీకరించిన బొమ్మల వంటివి. వీటన్నింటిని చూస్తూ ఉండే ద్రష్టనే నేను అని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి.
 
పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు.
 
భౌతికసంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది.
 
భయపడవద్దు... జాగరూకతతో పనిలో నిమగ్నం కండి. గమ్యం చేరుకునేంతవరకూ ఆగవద్దు.
 
పరిపూర్ణ అంకిత భావం. పవిత్ర, అతిసునిశితమైన బుద్ది, సర్వాన్ని జయించగల సంకల్పం- వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా మెుత్తం ప్రపంచంలో పెను మార్పు సంభవిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల వెంకన్నకు ఏడు వత్తులతో ఇలా దీపమెలిగిస్తే..?