శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకుడు... ఆరు నెలలకోసారి రంగు మార్చుకుంటున్నాడు...

వినాయకుడి విగ్రహం రంగు ఆరునెలకోసారి మారుతూఉంటుందట. ఉత్తరాయణ కాలం వరకు వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం నుండి తెల్లని రంగులోని మారుతారు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం వినాయకుని మహిమేనని భ

Webdunia
గురువారం, 5 జులై 2018 (10:50 IST)
వినాయకుడి విగ్రహం రంగు ఆరునెలకోసారి మారుతూఉంటుందట. ఉత్తరాయణ కాలం వరకు వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం నుండి తెల్లని రంగులోని మారుతారు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం వినాయకుని మహిమేనని భక్తులు అంటున్నారు. ఈ వినాయక ఆలయం తమిళనాడులోని నాగర్‌కోయిల్ జిల్లా కేరళపురం గ్రామంలో ఉంది.
 
ఈ ఆలయాన్ని మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయమని అంటారు. ఈ ఆలయంలో ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఆలయంలో మాత్రం వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఆ బావి నీరు తెల్లగా మారుతాయి, మళ్లీ వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఆ నీరు నల్లగా మారుతాయి.
 
సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళా ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. కానీ ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
 
ఈ ఆలయం 1317 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారుల అంచనా. నిజానికిది శివాలయమట. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉండేది. ఆ తరువాతనే ఈ వినాయకుని ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవల్ అతిశయ వినాయగర్ ఆలయమని అంటారు. 
 
ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తరువాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

తర్వాతి కథనం
Show comments