Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ లేడి కోసం తెల్లవార్లు చెట్టుపై కూర్చున్న బోయవాడు... పరమేశ్వరుడు ఏం చేశాడంటే?

ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క రూపమున వెలసిన పరమేశ్వరుడు ఆయా క్షేత్రములలో అద్భుతములు చేస్తాడు. ఆ పరమేశ్వరుని లీలలు చెప్పనలవిగానివి. ఎంతోమంది ఆర్తుల బాధలను తీరుస్తూ వారికి భక్తి, శ్రద్ధలను కలుగచేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఒక బోయవాడు వేటకు బయలుదేరాడు. సూర్యో

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (20:17 IST)
ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క రూపమున వెలసిన పరమేశ్వరుడు ఆయా క్షేత్రములలో అద్భుతములు చేస్తాడు. ఆ పరమేశ్వరుని లీలలు చెప్పనలవిగానివి. ఎంతోమంది ఆర్తుల బాధలను తీరుస్తూ వారికి భక్తి, శ్రద్ధలను కలుగచేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఒక బోయవాడు వేటకు బయలుదేరాడు. సూర్యోదయము నుండి సూర్యస్తమయము వరకు వెదకినను వేట లభించలేదు. అతడు వేటాడి ఇంటికి వెళ్తేనే కాని అతని కుటుంబానికి భుక్తి జరుగదు.
 
రాత్రి ఒక జాము గడిచిన తర్వాత ఒక లేడిపిల్ల అతని సమీపంలో కనిపించింది. ప్రాణాలు లేచివచ్చిన బోయవాడు బాణము సంధించేలోపే ఆ మృగము మనుష్య భాషలో ఇలా అంది. అయ్యా.. నేను కడు చిన్నదానను. కొంచెం సేపటిలో మా తల్లి ఇటు వస్తుంది. దానిని వేటాడిన నీ కుటుంబానికి కడుపు నిండును. నన్ను చంపిన మీ కుటుంబానికి ఆహారముగా సరిపోదు అని బోయవానిని బ్రతిమాలింది. జాలి చెందిన బోయవాడు దానిని చంపక వదిలి పెట్టాడు. 
 
మరలా బోయవాడు వేటకై నిరీక్షింపసాగాడు. రెండవ జాము జరుగు వేళలో పూర్ణ గర్భిణియైన జింక వచ్చింది. బోయవాడు బాణము సంధించాడు. అయ్యా... నేను పూర్ణగర్భిణిని, తెల్లవారులోగా నాకు ప్రసవము జరుగుతుంది. నా గర్భమున ఉన్న శిశువును చంపకూడదు. అది మహా పాపము. కాబట్టి నాకోసం వేచియుండు. నేను వచ్చెదను అని మాట ఇచ్చింది. ఇదేదో చిత్రంగా ఉన్నదే అని బోయవాడు సమీపమున ఉన్న ఒక వృక్షమును ఎక్కి కూర్చున్నాడు. అతడికి నిద్ర రాకుండా ఉండేందుకు ఆ వృక్ష దళాలను ఒక్కొక్కటి తుంచి ఆ చెట్టు తొర్రలో వేయసాగాడు.
 
అట్లా చాలా సమయము గడిచింది. తెల్లవారేసరికల్లా అప్పుడే ప్రసవమైన లేడి తిరిగి బోయవాని దగ్గరకు వచ్చింది. బోయవాడు ఎంతో ఆశతో బాణమును సంధించబోయాడు. అప్పుడు ఆ లేడి అయ్యా... నా కొరకు రాత్రంతా మేలుకొన్నావు. మేలుకున్నవాడివి ఊరుకొనక రాత్రంతా మారేడు దళాలు త్రుంచినావు. త్రుంచిన దళాలను తొర్రలో వేయగా, తొర్రలో ఉన్న శివలింగంపై పడి పూజ చేసిన పుణ్యం దక్కింది. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం. రాత్రంతా జాగరణ చేసి, శివపూజ చేసి పుణ్యం చేసుకున్నావు. ఇంతటి పుణ్యమూర్తివి జీవహింస చేయటమెందుకు అని మాయమైంది ఆ లేడి. అప్రయత్నంగా పుణ్యము నార్జించుకున్న బోయవాడు శివ సాయుజ్యాన్ని పొందాడు. ఏ రీతిగా సేవించినా ఆ భోళాశంకరుడు కోరిన వరాలను ఇస్తూ జనులను సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...

కొండగట్టు ఆంజనేయ స్వామికి బంగారు కిరీటం, వెండి ఆభరణాలు

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

11-02-2025 మంగళవారం రాశిఫలాలు - త్వరలోనే రుణవిముక్తులవుతారు...

తర్వాతి కథనం
Show comments