Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి రోజున దీపదానం... సముద్ర స్నానం చేస్తే?

దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపం కాంతికి చిహ్నం. అలాంటి దీపాన్ని పూజాగదిలో వెలిగిస్తుంటాం. బిజీ లైఫ్‌లో దీపం పెట్టేందుకు వీలుకాకపోతే కార్తీక పౌర్ణమి రోజైనా దీపాన్ని వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (14:04 IST)
దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపం కాంతికి చిహ్నం. అలాంటి దీపాన్ని పూజాగదిలో వెలిగిస్తుంటాం. బిజీ లైఫ్‌లో దీపం పెట్టేందుకు వీలుకాకపోతే కార్తీక పౌర్ణమి రోజైనా దీపాన్ని వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. పూజాదికాలను పూర్తి చేసుకుని.. ఉపవాసం ఆచరించి.. సాయంత్రం పూట ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. 
 
అదే రోజున బియ్యపుపిండి లేదా గోధుమపిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేస్తుంటారు. దీపదానం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. స్తోమత గలవారు 365 దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. 
 
కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే మేలు జరుగుతుంది. ఏడాదిలో ఆషాఢం, కార్తీకం, మాఘ, వైశాఖ మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయడం కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని ప్రభావం అధికంగా వుంటుంది. అలాంటి సమయంలో సముద్ర స్నానం చేయడం ద్వారా సమస్త చర్మ రుగ్మతలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా, మనం చేసే దుష్కృతులను పోగొట్టి మన పాపాలను దూరం చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments