నరక చతుర్ధశి.. దీపావళి రోజున సూర్యోదయానికి ముందే తలంటుకోవాలి..
నరక చతుర్ధశి రోజు యమునికి ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని.. అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారన
చతుర్దశ్యాం తు యే దీపాన్
నరకాయ దదాతి చ|
తేషాం పితృగణా స్సర్వే
నరకాత్ స్వర్గ మాప్నుయుః ||
నరక చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. నరక చతుర్దశి రోజున సాయంత్రం.. నూనె తడిపి, తాటిపువ్వుల పొడితో తయారు చేసిన కాగడాలని చేతబట్టుకుని తిరిగినట్లైతే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందని విశ్వాసం. ఈ పద్ధతి ఇప్పటికీ గ్రామాల్లో వుంది. నగరాల్లో ఈ పద్ధతి కనిపించదు.
నరక చతుర్ధశి రోజు యమునికి ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని.. అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.
అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా "యమాయయః తర్పయామి'' అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. ఇలా చేస్తే పితృదేవతలకు మేలు జరుగుతుందని విశ్వాసం. అలాగే ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని నమ్మకం.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.