Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక... కానీ...

ప్రశ్న: నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. కానీ పరిస్థితులు సానుకూలంగా ఉండటంలేదు. ఏం చేయమంటారు? సద్గురు: చూడండి. మీరు ఈశ్వరుని నమ్ముతారు. అవునా...? విషయాలు మీ కోరిక ప్రకారం జరగడం లేదంటే మరి భగవంతుని ఇష్టప్రకారం జరుగుతున్నట్లే కదా. మీరు నిజంగ

Webdunia
శనివారం, 16 జులై 2016 (18:15 IST)
ప్రశ్న: నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. కానీ పరిస్థితులు సానుకూలంగా ఉండటంలేదు. ఏం చేయమంటారు?
 
సద్గురు: చూడండి. మీరు ఈశ్వరుని నమ్ముతారు. అవునా...? విషయాలు మీ కోరిక ప్రకారం జరగడం లేదంటే మరి భగవంతుని ఇష్టప్రకారం జరుగుతున్నట్లే కదా. మీరు నిజంగా దేవుని నమ్మితే విషయాలు మీరనుకున్నట్లుగా ఎందుకు జరగాలి?
 
సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఉండి తీరుతారని కాదు. సంతోషంగా ఉండాలని మీ కోరిక. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే దుఃఖానికి కారణాలేమిటో మీరు తెలుసుకోవాలి. మీరిక్కడ కూర్చుని మీ పనిని మీ నమ్మకాల్ని చెత్తాచెదరాన్ని అంతా వదిలేయండి. మీరు సంతోషంగా ఉంటారు. జనంతోనూ పరిస్థితులతోనూ వ్యవహారాలు నడిపే ప్రక్రియలో మీకు దుఃఖం ఎదురవుతోంది. మీ స్వీయ స్వభావ ప్రకారం మీరు సంతోషంగానే ఉన్నారు. అది గమనించండి. మీరు జీవితంలో కొన్ని విషయాలను పెట్టుబడిగా పెడుతున్నందుననే మీరు దుఃఖం పొందుతున్నారు. అవును కదూ. మీ పని మీ కుటుంబం మీ సిద్ధాంతం ఇంకా ఏదేదో. 
 
మీరు ఏవో ఇతర వ్యాపకాలు పెట్టుకున్నారు. అవే దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. మీరు ఆ వ్యాపకాలన్నీ మానేసి పసిపిల్లవాడిలా ఇక్కడ ఉండిపోతే మీరు సంతోషంగా ఉంటారు. ఇంతకూ సమస్య ఏమిటంటే మీరు ఆ వ్యాపకాలతో మమేకమయినారు. 
 
ఇప్పుడు ఇక్కడ మాట వరసకు నా దగ్గర ఉన్న ఈ బుట్టను మీరు తయారుచేశారనుకుందాం. ఇది తయారుచేయడానికి మీకు 10 రోజులు పట్టింది. అందుకు మీరెంతో శ్రద్ధ కూడా తీసుకున్నారు. ఎవరో ఒక్క మనిషి ఇక్కడకు వచ్చారు. ఈ బుట్ట మీదు కాలు వేశాడు. ఇపుడు మీలో కోపం పెల్లుబుకుతోంది. అంతడు మీ తలమీద కాలువేయలేదు. మీ శరీరం మీద అతడు నడవలేదు. కేవలం బుట్ట మీద కాలు వేశాడు. అంతమాత్రాన మీలో అంత కోపం, అంత ద్వేషం ఎందుకు?
 
ఇది మీరు కాదు. ఇది ఒక బుట్ట మాత్రమే. మీరు దానితో మమేకమైనారు. ఇప్పుడు మీరు నిజంగా బుట్ట అవుతారా? కాలేరు. మీరు అవాస్తవంలో తేలుతున్నట్లు రుజువు చేస్తున్నారు. అవునా? మీరనుకుంటున్నారు.. నేను బుట్టను అని అందువలనే ఒవరో ఒకరు బుట్ట మీద కాలు మోపగానే మీకు కోపం కట్టలు తెంచుకుంటున్నది. అతడు ఒకవేళ మీ శరీరం మీద కాలు మోపినా కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ శరీరం మీరు కాదు. అవును దీనిని మీరు నా మాటలలోని అర్థాన్ని మాత్రమే గ్రహించండి. కాని ఇలా ఎందుకంటున్నానో అర్థం చేసుకోండి. జీసస్‌ను ఎవరో చెంప మీద కొడితే ఆయన రెండో చెంప చూపించాడట. అలా ఎవరు చేయగలుగుతారు? శరీరంతో మమేకమయితే రెండో చెంపను కూడా చూపగలడా? శరీరంతో మమేకమైన వ్యక్తికి జీసస్ చర్య మూర్ఖంగా తోస్తుంది. పూర్తిగా మూర్ఖత్వమే. అవునా... కానీ శరీరంతో మమేకం కాని వారికి అది సరైన చర్య. మనిషి చేయవలసింది అదే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments