Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో దళారుల దారులకు మూత...

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్యూలైన్లలో చేసిన మార్పులు చేర్పులపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొత్త క్యూలైన్ల విధానాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాలకమండలి సభ్యుల్లోనే ఏకాభిప్రాయం లేదు. అయితే నూతన విధానం వల్ల దళారులకు పూర్తిస్

Webdunia
శనివారం, 16 జులై 2016 (17:05 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్యూలైన్లలో చేసిన మార్పులు చేర్పులపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొత్త క్యూలైన్ల విధానాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాలకమండలి సభ్యుల్లోనే ఏకాభిప్రాయం లేదు. అయితే నూతన విధానం వల్ల దళారులకు పూర్తిస్థాయిలో బ్రేక్‌ పడిందనడంలో సందేహం లేదు. భక్తులను అడ్డదారుల్లో తీసుకెళ్ళి, దర్శనాలు చేయించి, రోజూ వేల రూపాయలు జేబులో వేసుకుంటున్న దళారులకు దారులన్నీ మూసుకుపోయాయి. దీంతో పాలకమండలి సభ్యులను రెచ్చగొట్టి, ప్రభావితం చేసి పాత క్యూ పద్ధతిని మళ్ళీ పెట్టించాలని ప్రయత్నిస్తున్నారు.
 
శ్రీకాళహస్తి దేవస్థానంలో దర్శన దళారులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. భక్తులతో ఒప్పందాలు కుదుర్చుకుని, ఆలయ సిబ్బందితో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని, అడ్డదారుల్లో స్వామివారి అంతరాలయం దాకా తీసుకెళ్ళేవారు. ఒక్కో బృందానికి దర్శనం చేయించినందుకు రూ.500 నుంచి 2 వేల రూపాయల దాకా దండుకునేవారు. కొందరికి ఇదే ఉపాధి  మార్గంగా ఉంది. ఆలయ ఉద్యోగులు కూడా కొందరు దళారుల అవతారమెత్తి జేబులు నింపుకుని ఇంటికెళ్ళేవారు. దర్శనాల వ్యాపారం జిల్లాలోని ఏ ఆలయంలోను లేనంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతోంది.
 
ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. కంచుగడప తరువాత ఒకటే క్యూలైను. ఉచిత దర్శనం వారైనా, 50 రూపాయల ప్రత్యేక దర్శనం భక్తులైనా, 200 రూపాయల శీఘ్ర దర్శనం భక్తులైనా ఎవరైనా అక్కడి నుంచి ఆ క్యూలో వెళ్ళాల్సిందే. అడ్డదారిలో వెళ్ళాలన్నా దారిలేదు. ప్రత్యేకంగా ఎవరైనా దర్శనానికి తీసుకెళ్ళాలంటే ఈ క్యూను ఆపేయాల్సిందే. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా క్యూలైను ఆపడం సిబ్బందికి సాధ్యం కాదు. దీంతో అడ్డదారుల్లో దర్శనాలు చేయించడం అసాధ్యంగా ఉంది. అదేవిధంగా గతంలో దళారులు తీసుకెళ్లే భక్తులను, పలుకబడి ఉండేవారు తీసుకెళ్లే భక్తులను నేరుగా అంతరాలయం దాకా అనుమతించేవారు. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా తొలగించారు. 
 
అడ్డదారుల్లో వెళ్ళి అంతరాలయంలో అడ్డంగా నిలబడే భక్తుల వల్ల సర్వదర్శనం లైన్‌లో వచ్చే భక్తులకు స్వామివారు సరిగ్గా కనిపించేవారు కాదు. ఇప్పుడు ఇలాంటి ఆటంకాలు తొలగిపోయాయి. అందరికీ ప్రశాంతంగా, నింపాదిగా దర్శనం జరుగుతోంది. మహద్వారంలోకి ప్రవేశించాక 15 నిమిషాల్లో దర్శనం పూర్తవుతోంది. కొత్త దర్శన విధానం స్థానికులకు మాత్రం కాస్త అసంతృప్తి కలిగిస్తోంది. గతంలో ప్రత్యేక లైనులో వెళ్ళి 10 నిమిషాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని బయటకు వచ్చేవారు. ఇప్పుడు కూడా స్థానికులకు నిర్ణీత సమయాల్లో ప్రత్యేక లైనులో అనుమతిస్తున్నా..కంచుగడప నుంచి అందరితో కలిసి వెళ్ళాల్సి వస్తోంది. అదేవిధంగా 200 రూపాయల శీఘ్రదర్శనం భక్తుల్లోను కొంత అసంతృప్తి ఉంది. చిన్నపాటి మార్పులు చేయగలిగితే అందరినీ సంతృప్తి పరచడానికి వీలుంది.
 
కాస్త ఇరుకైనా 200రూపాయల దర్శనం భక్తులను, స్థానికులను మహద్వారం వద్ద కాకకుండా ధ్వజస్థంభం వద్ద సాధారణ లైనులో కలిపితే సమంజసంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహద్వారం వద్ద మూడు లైన్లు ఏర్పాటు చేయడం కష్టమైతే ఇప్పుడున్న రెండు లైన్లలోనే కొంతసేపు ప్రత్యేక దర్శన భక్తులను, కొంతసేపు సర్వదర్శన భక్తులను లోనికి అనుమతించవచ్చు. లోపల ధ్వజస్థంభం వరకు వెళ్ళేదాకా ప్రత్యేక లైన్లు కొనసాగించవచ్చు.
 
గతంలో భక్తులను ఆలయం లోనికి అనుమతించి అక్కడి క్యూలైన్లలో నిరీక్షించేవారు. ఇప్పుడు బయటే నిరీక్షిస్తున్నారు. దీంతో క్యూ భిక్షాల గాలిగోపురం దాటి రోడ్డుమీదకు వస్తోందన్న విమర్సలు వినిపిస్తున్నాయి. అందుకే ఆలయం లోపలే తాత్కాలికంగానైనా షెడ్లు నిర్మించి అందులో భక్తులు కూర్చోవడానికి ఏర్పాటు చేసి క్యూలైన్లు ఖాళీ అయిన తరువాత షెడ్లలోని భక్తులను అనుమతించవచ్చు. దీంతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త క్యూలైన్ల వ్యవస్థ శాశ్వతమవుతుంది. లేకుంటే చిన్నచిన్న కారణాలు అసౌకర్యాలు చూపించి కొత్త విధానాన్ని రద్దు చేయించే ప్రమాదముంది. దళారులు ఇందుకోసమే కాచుకుని కూర్చున్నారు. 
 
స్థానికుల పేరు చెప్పి, భక్తుల అసంతృప్తిని ఆసరాగా చూపించి కొత్త విధానానికి ఎలాగైనా మంగళం పాడలని చూస్తున్నారు. ఇందుకోసం బోర్డు సభ్యులను, రాజకీయ నాయకులను రెచ్చగొడుతున్నారు. రోజుకు 20 వేలు 30 వేల మంది దాకా శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్సిస్తున్న నేపథ్యంలో దర్శనం విధానాన్ని పకడ్బందీగా తీర్చిదిద్దకపోతే సాధారణ భక్తులకు ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్త విధానంలో తమ వారికి దర్శనాలు చేయించడంలో పరిమితులున్నా పాలకమండలి సభ్యులు, రాజకీయ నాయకులు దీనికి సహకరించి, వ్యవస్థనలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం

తర్వాతి కథనం
Show comments