నేను నీకేమి ఇవ్వలేదా అని సాయిబాబా ప్రశ్నించారు

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (23:21 IST)
నామ రూపాల వల్ల కలిగిన లౌకిక సుఖ భ్రాంతి విడిస్తే గాని..... బాబా పరిభాషలో చెప్పాలంటే పంచేంద్రియాలను సమర్పిస్తే గానీ.... గురుకృప లభించదు. బాగా ఆలోచించి నామ రూపాత్మకమైన ఇంద్రియ విషయాలు నిజంగా సుఖమయములు గావని మొదట ముముక్షువు తెలుసుకోవాలి. అప్పుడు గాని విషయాల పట్ల వైరాగ్యం కలుగదు. కానీ అందుకు తగిన జీవితానుభవం సద్గురు కృప వల్లనే కలుగుతుంది. అందుకే సాయి రేగేను భ్రమింపజేసిన అరటి తొక్కను మాత్రమే అతనికి ఇచ్చారు. 
 
ఒకసారి కాదు ముమ్మారు.... నిజమైన ఆత్మ సుఖం ఇంద్రియ విషయాల మాటున దాగి ఉంటుంది. సద్గురువు దానినే అనుభవిస్తుంటారు. అటువంటి గురువు, విశ్వాసం, ఓరిమిలతో తమను శరణు పొంది, మొదట తాము ప్రసాదించిన కఠిన పరీక్షలను విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరించిన సచ్చిష్యునికి మాత్రమే ప్రసాదిస్తారు. దానిని అరటిపండు ఒలిచినట్లు అత్యంత సులభంగా బహిర్గతం చేసి నోటికి అందిస్తారు. ఓరిమితో గురువుని నమ్మి సేవించే వారికి ఉత్తమోత్తమైన శ్రేయస్సు చేకూరుస్తారు. ఈ విషయంపై భక్తునికి సద్గురువు పట్ల పూర్ణమైన విశ్వాసం ఉండాలి. 
 
అట్టివాడే సద్భక్తుడు. తాత్కాలికంగా అతనికి కూడా సద్గురువు ఇతరులను అనుగ్రహించినంత మాత్రం గూడా తనను అనుగ్రహించడం లేదని ఆ సమయంలో తోస్తుందని తెల్పడానికే బాబా నేను నీకేమి ఇవ్వలేదా అని రేగేను ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితుడు రీనీట్ రాసేందుకు అనుమతి... ఎలా?

కార్పొరేట్ ఉద్యోగానికి కాదని ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి...

నీట్ రీ-టెస్ట్ భద్రత ఏర్పాట్లపై అన్నామలై మండిపాటు.. పరీక్షా సమయం పెంపుపై అభ్యంతరం

అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ

హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

తర్వాతి కథనం
Show comments