నన్ను నమ్మిన వారిని ఎన్నడు పతనం కానివ్వను... సాయిబాబా సూక్తులు.

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (22:53 IST)
1. నాపై నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి నిలుపుతాను.

2. గురువును సంపూర్ణంగా.. అంటే అన్నింటీకీ, అన్ని కాలాల్లోను, పరిస్థితుల్లోను నమ్ముకో, అదే అసలైన సాధన.

3. గురువే అన్ని దైవాలున్నూ, సాధన చతుష్టయం, శాస్త్రషట్కం అక్కర్లేదు. గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు.

4. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. నేను నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.

5. నన్ను నమ్మిన వారిని ఎన్నడు పతనం కానివ్వను.

6. నా సమాధి నన్నాశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది.

7. పని చేయి, దేవుని నామం ఉచ్చరించు, సత్గ్రంథాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు.

8. నువ్వేం చేసినా సంపూర్ణంగా, క్షుణ్ణంగా చెయ్యి లేదా చెయ్యటానికి ఒప్పుకోకు.

9. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. ఒకటిరెండు రకాల పదార్థాలతో తృప్తి చెందు.

10. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్

విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?

నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని

శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...

అన్నీ చూడండి

లేటెస్ట్

14-04-2026 మంగళవారం ఫలితాలు - మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది...

13-04-2026 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి ఆశాజనకం.. పరిస్థితులు చక్కబడతాయి...

12-04-2026 ఆదివారం ఫలితాలు - ఏ పనీ చేయబుద్ధికాదు

12-04-2026 నుంచి 18-04-2026 వరకు మీ వార ఫలితాలు

ఐదు అత్యుత్తమ మంత్రాలు ఏవి.. శనివారం ఈ మంత్రాలను జపిస్తే?

తర్వాతి కథనం
Show comments