Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిర్డి సాయిబాబా దివ్యవాక్కులు....

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (22:34 IST)
శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి. వైష్ణవులకు విఠలుడు. శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు. క్లిష్టతరమైన సంసారాన్ని బాబా జయించాడు. బాబాకు శాంతమే భూషణం. మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు. బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది. 
 
బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు.బాబాకు అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని బాబా చెప్పారు. తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు.  మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం చేశాడు.
 
బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా.... బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబా ది సచ్చిదానంద స్వరూపం. సాయినాధుడు నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. ఎల్లప్పుడు ఆత్మానందంలో తేలియాడుతుండేవారు.
 
మన గురించి మనం ఆలోచించడం  మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి నేను, నాది అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నారు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవరాశుల్లో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పారు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments